రాష్ట్రీయం

ఏకగ్రీవానికి ఎత్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 10: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో మొదటి దశలో ఎన్నికలు జరుగుతున్న 362గ్రామ పంచాయతీల్లో అధికశాతం పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. రెండు జిల్లాల పరిధిలోని 13మండలాల పరిధిలో ఉన్న 362గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు 1952నామినేషన్లు, 3270వార్డులకు 8419నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ఉప సంహరణకు ఈ నెల 13వ తేదీ వరకు సమయం ఉన్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ అధిక భాగం సర్పంచ్‌లు, వార్డులను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఘనవిజయం సాధించిన టీఆర్‌ఎస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో ఘోర పరాజయం ఎదురైన నేపథ్యంలో అధిక పంచాయతీలను గెలుచుకోవడం ద్వారా తమ పట్టు నిలుపుకునేందుకు టీఆర్‌ఎస్ నేతలు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా రాష్ట్ర మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆయా నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నేతలు జిల్లాలోనే మకాం వేసి తమ నియోజకవర్గ పరిధిలో అధిక స్థానాలను గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అనేక గ్రామాల్లో తమకు సర్పంచ్ పదవి ఇస్తే చాలని, మిగిలిన ఉప సర్పంచ్‌తో పాటు వార్డులన్ని ఇతరులకు ఇస్తామని చర్చలు జరుపుతున్నారు. సాధారణ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో తాము ఎక్కువ పంచాయతీ సర్పంచ్‌లను గెలిచామని అధినాయకునికి చూపించడమే లక్ష్యమని ఆ పార్టీ సీనియర్ నేతలు చెప్పుకొస్తున్నారు. మరోవైపు తమ ప్రతిపాదనలకు ప్రత్యర్థులు ఒప్పుకోకపోతే గెలిచేందుకు ఉన్న అన్ని దారులను వెతుకుతున్నారు. ఇప్పటికే 15గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయిన నేపథ్యంలో ఆ సర్పంచ్‌లంతా తమ పార్టీలోనే ఉండేలా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లోని ప్రధాన నేతలతో మాజీమంత్రి, టీఆర్‌ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. సాధారణ ఎన్నికల్లో మాదిరిగా పంచాయతీ ఎన్నికల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరికలు కూడా జారీచేశారు. ఈ నేపథ్యంలో మొదటి దశ ఉప సంహరణ గడువైన 13వ తేదీలోగా ఎక్కువ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవాలని, ఆ వెంటనే రెండవ దశ ఎన్నికలు జరిగే మండలాలపై దృష్టి సారించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.