రాష్ట్రీయం

సంక్రాంతికి 60 జనసాధారణ్ రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సంక్రాంతి పండుగ, ప్రయాణీకుల రద్దీని దృష్టిలోపెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ‘అన్ రిజర్వుర్డ్’ ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇవి ఈనెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ నడుస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్‌వో సీహెచ్ రాకేష్ వెల్లడించారు. హైదరాబాద్- సికింద్రాబాద్- విజయవాడ- విశాఖపట్నం- తిరుపతి- కాకినాడ మధ్య ఈ జనసాధారణ్ రైళ్లు నడుపుతున్నారు. వీటిలో మహిళలకు ప్రత్యేకంగా బోగీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక రైళ్ల ద్వారా రోజుకు లక్షా 20 వేల మందిని గమ్యస్థానాలకు చేరవేస్తామని అధికారులు చెబుతున్నారు. సామాన్య ప్రయాణికుల కోసం ఈ రైళ్లు నడుపుతున్నట్టు రాకేష్ పేర్కొన్నారు. బస్సు చార్జీలకు పోలిస్తే రైళ్లో కనీసం 50 శాతం టిక్కెట్ ధర తక్కువ ఉంటుందని చెప్పారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు చార్జీ కేవలం రూ. 120 రూపాయలు మాత్రమే. జనసాధారణ్ రైల్ కోసం టిక్కెట్ ఎక్కడైనా కొనవచ్చునని అధికారులు తెలిపారు. అన్ రిజర్వుర్డు టిక్కెట్ సిస్టమ్ మొబైల్ యాప్ ( యుటీఎస్ ఆన్ యాప్)ను వినియోగించుకోవచ్చునని అధికారులు స్పష్టం చేశారు.