తెలంగాణ

ఖమ్మం తెరాసలో విభేదాలు భగ్గు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 11: అసెంబ్లీ ఎన్నికలు రాష్టవ్య్రాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణుల్లో ఆనందాన్ని నింపితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మాత్రం విభేదాలకు ఆజ్యం పోశాయి. రాష్టవ్య్రాప్తంగా తెరాసకు అన్ని జిల్లాల్లో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ ఖమ్మం జిల్లాలో ఒక్కస్థానం మాత్రమే గెలవగా కొత్తగూడెం జిల్లాలో బోణీ కూడా చేయలేకపోయింది. ఈ ఎన్నికలు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పరిధిలో తెరాసకు ప్రధాన నేతలుగా ఉన్న వారి మధ్య మరింత వైరుధ్యం పెంచాయి. ముఖ్యంగా ఇటీవలి ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులకు, పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలను ఒకరిపై ఒకరు వేసుకుంటూ ఆరోపణలు గుప్పించుకునే పరిస్థితి నెలకొంది. తాజా ఎన్నికల్లో తెరాస సీనియర్ నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గంలో ఓటమిపాలు కావటం పార్టీకి షాకిచ్చింది. తుమ్మల ఓటమి ప్రకంపనలు పార్టీలో ఇంకా సద్దుమణగలేదు. తెరాస అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఖమ్మం జిల్లాలో పార్టీ అభ్యర్థుల ఓటమికి తమ నేతల మధ్య తగాదాలే కారణమని బాహాటంగానే ప్రకటించారు. అదే క్రమంలో ఈవీఎంల ట్యాంపరింగ్ అంశంపై మాట్లాడిన సమయంలో అదే జరిగితే ఖమ్మం జిల్లాలో తుమ్మల గెలిచేవాడని చెప్పుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా తుమ్మల ఓటమి పార్టీ ప్రధాన నాయకులు, కార్యకర్తలను కుంగిదీసింది. అయితే ప్రధాన నేతల మధ్య విభేదాలే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమని తేలిపోయింది. ఇటీవల మాజీ మంత్రి తుమ్మల జిల్లాలో జరగనున్న పంచాయతీ ఎన్నికలపై నేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన సమయంలో కొందరు నాయకులు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఇటీవల పోటీచేసి ఓడిపోయిన మదన్‌లాల్ (వైరా), తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట), పిడమర్తి రవి (సత్తుపల్లి), జలగం వెంకట్రావ్ (కొత్తగూడెం) ఎంపీ వైఖరిపై సీఎం కేసీఆర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలపై విభేదాల ప్రభావం పడే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన నాయకత్వం మండలాల వారీగా ప్రధాన నేతలకు బాధ్యతలు అప్పగించింది. ఇదే సమయంలో సమీక్ష సమావేశాల్లో తుమ్మల గతాన్ని మర్చిపోయి పంచాయతీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునివ్వడమే కాకుండా, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు తెలిస్తే రాష్ట్ర పార్టీకి నివేదికలు ఇవ్వాలని కోరారు. జిల్లాలో పర్యటిస్తున్న ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోడు భూములతో పాటు కొన్ని సమస్యల వల్ల పార్టీ ఓటమి పాలైందని, కొందరు నేతలు ప్రజలకు దూరం కావటం వల్ల కూడా ఈ సమస్య ఎదురైందని వాదిస్తున్నారు.