రాష్ట్రీయం

హైందవ ధర్మ పరిరక్షణే ప్రథమ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), జనవరి 12: సనాతన హైందవ ధర్మ పరిరక్షణ, ప్రచారమే విశాఖ శారదాపీఠం ప్రధాన లక్ష్యమని ఆ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి స్పష్టం చేశారు. శనివారం గుంటూరుకు విచ్చేసి, పలు ఆలయాలను సందర్శించి, వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న స్వరూపానందేంద్ర తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. విశాఖ శారదాపీఠం తొలినాళ్ల నుంచి వ్యాపారాత్మక ధోరణితో లేదని స్పష్టం చేశారు. సార్వజనీన వికాసం కోసం జగన్మాత అనుగ్రహం, పరమ గురువుల ఆశీస్సులతో శారదా పీఠం వ్యవస్థీకృతమైందని స్పష్టంచేశారు. పూర్తిగా ధర్మపరిరక్షణ కోసం, ధర్మ ప్రచారం కోసమై వ్యవస్థీకృతమైన పీఠమని స్వామీజీ గుర్తుచేశారు. పీఠం ఆవిర్భావం నుంచి కూడా భారతదేశంలో హైందవ ధర్మానికి ఎక్కడ విఘాతం కలిగినా, దేవాలయ వ్యవస్థకు ఇబ్బందులు ఎదురైనా మొదటగా స్పందిస్తోంది విశాఖ శారదాపీఠమేనని గుర్తుచేశారు. ప్రాచీనమైన మన ఆలయాలను, హైందవ ధర్మాన్ని పరిరక్షించనప్పుడే సమాజం శాంతిమయం, కాంతిమయం అవుతుందని, తద్వారా సకలజనులు ఆనందంగా ఉంటారన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది విశ్వకళ్యాణం సిద్ధించడానికి మూలకారణమవుతుందని స్వామీజీ ఉద్బోధించారు. పలువురు ప్రజాప్రతినిధులు, పలు దేవాలయాలకు చెందిన పాలకవర్గ సభ్యులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు స్వామీజీని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. కాగా స్వామీజీ విచ్చేసిన ఆలయాల్లో, కార్యక్రమాల్లో అర్చక బృందం ఎదురేగి పూర్ణకుంభ స్వాగతం పలికారు.