రాష్ట్రీయం

యువశక్తిని ప్రపంచానికి చాటిన మహనీయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: స్వామి వివేకానందుడు భారతీయ సంస్కృతికి ప్రతిరూపమని, యువత సంకల్పానికి ప్రతిబింబమని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని స్వర్ణ్భారతి ట్రస్టులో ఆయన యువతను ఉద్ధేశించి మాట్లాడారు. వివేకానందుడి బోధనలు అసాధారణమైనవి, కాలదోషం పట్టనివని, అవి అన్ని కాలాలకు వర్తించే నియామాలేనని, నిరంతరం ప్రవహించే గంగా ప్రవాహం వంటివని అన్నారు. భారతీయ సంస్కృతిలో తాత్వికమైన, సమీకృతమైన, సార్వత్రికమైన లక్షణాలున్నాయని, ప్రపంచం ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు భారత్ పరిష్కారం చూపిందని పేర్కొన్నారు. వైవిధ్యమైన మతాలకు, సాంస్కృతిక నమ్మకాలను, వివిధ అభిప్రాయాలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి వివిధ అభిప్రాయాల మధ్య చక్కని వారధి నిర్మించిన ఘనత వివేకానందుడిదేనని అన్నారు. వివేకానందుడు బోధనలను జీవితంలో ఆచరించడం ద్వారా ప్రజా జీవితాల్లో సానుకూల మార్పులు సాధ్యమని అన్నారు. 125 ఏళ్ల క్రితం చికాగో సర్వమత సమ్మేళనంలో వివేకానందుడు ప్రసంగం యావత్ ప్రపంచానికి దిశానిర్దేశం చేసిందని, వారి వాక్పటిమను, నిజాయితీతో కూడిన ప్రసంగాన్ని, సంభాషణలను ప్రతి ఒక్కరినీ సమ్మేహితుల్ని చేసిందని అన్నారు. మహిళా సాధికారత , ఆత్మవిశ్వాసం, ధైర్యం వంటి అంశాల గురించి తెలియజేసిన అంశాలు అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. మనిషి శరీరం ధరించినపుడు సాక్షాత్తు భగవంతుడైనా బాధలను అనుభవించి తీరాలన్న వారి మాటలను ఆదర్శంగా తీసుకుని వారు చెప్పినట్టు దృష్టి అంతా బాధలపై కాకుండా సమస్యల పరిష్కారంపై ఉండాలని అన్నారు. ఆధునిక యువత అద్భుతాలను సాధించగలదని వివేకానందుడు మనసా వాచ కర్మణా నమ్మారని, యువశక్తిని ప్రపంచానికి తెలియజేసిన వారి జీవితం యువతకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. వివేకానందుడు సందేశాలు సూటిగా యువత హృదయాన్ని తాకుతాయని, ముప్పై తొమ్మిదేళ్ల వయస్సులో తనువు చాలించిన వివేకానందుడు సంపూర్ణంగా భారతీయ యువతకు ప్రతిబింబమని అన్నారు. వివేకానందుడు మాటలను ఆచరణలో పెట్టడం ద్వారా జీవితంలో యువత మరింత ఎత్తుకు ఎదగాలని ఉప రాష్ట్రపతి ఆకాంక్షించారు.

చిత్రం..శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని స్వర్ణ్భారతి ట్రస్టులో మాట్లాడుతున్న వెంకయ్యనాయుడు