రాష్ట్రీయం

పల్లె బాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జనవరి 12: హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై శనివారం పండుగ రద్దీ పెరిగిపోయింది. హైవేపై ఎడతెరిపి లేకుండా వాహనాలు బారులుకట్టాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరాయి. టోల్‌ప్లాజా నుంచి అంకిరెడ్డిగూడెం దివీస్ పరిశ్రమ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్‌కు పొగమంచు తోడవ్వడంతో మరింత ఇబ్బందులు ఏర్పడ్డాయి. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన రద్దీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. టోల్‌ప్లాజా దాటి వెళ్లాలంటే సుమారు రెండు గంటలకు పైగా పట్టింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకోని రెట్టింపు దాటాయని అధికారులు చెబుతున్నారు. పంతంగి టోల్ వద్ద 16 గేట్లు ఉండగా 11 గేట్లను విజయవాడ వైపుకు తెరిచారు. ఐదు గేట్లను మాత్రమే హైదరాబాద్ వైపుకు వదిలారు. వాహనాల సంఖ్య మరింత పెరిగితే మరో రెండు గేట్లు తెరిచేందుకు ఏర్పాట్లు చేసారు.
పుల్లూరు టోల్‌ప్లాజా..
జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద వాహానాలు బారులుతీరాయి. వాహనాలు టోల్ రుసుం చెల్లించేందుకు దాదాపు 40 నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో టోల్‌గేటు ప్రాంతం వాహనాలతో కిక్కిరిసి పోయింది.

చిత్రాలు.. దట్టమైన పొగ మంచులో పంతంగి టోల్ ప్లాజా వద్ద బారులుతీరిన కార్లు
*మొబైల్ యంత్రంతో టోల్ వసూలు చేస్తున్న విధానాన్ని పరిశీలిస్తున్న డీసీపీ రామచంద్రారెడ్డి