ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలంలో అడుగంటుతున్న కృష్ణమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం ప్రాజెక్టు, మార్చి 30: తెలుగు రాష్ట్రాల్లో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు శ్రీశైలం రిజర్వాయర్ కనిష్ట నీటి మట్టానికి ఇంకా కిందికి తగ్గించి నీరు వాడుకునేందుకు అధికారులు సిద్ధవౌతున్నారు. మంచినీటి కొరత దృష్ట్యా కృష్ణానది యాజమాన్య బోర్డు 790 అడుగుల నీటిమట్టం వరకు నీటిని వాడుకునేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. కాని, తీవ్రమైన మంచినీటి ఎద్ద డి దృష్ట్యా ఇంకా దిగువకు అనగా 770 అడుగుల నీటిమట్టం వరకు నీరు వాడుకునేందుకు సిద్ధవౌతున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంలో తెలంగాణ, ఎపి రాష్ట్రాల ప్రభుత్వాల అభిప్రాయాలను తెలపాల్సిందిగా కృష్ణానది యాజమాన్య బోర్డు కోరినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులో నీటి నిలువ సామర్థ్యం తగ్గి పూడిక పెరిగినందున రిజర్వాయర్ నుంచి 770 అడుగుల వరకు నీటిని తోడితే బురదతో కూడిన నీరు మాత్రమే వచ్చే అవకాశం ఉందని శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు. రిజర్వాయర్ ప్రస్తుత నీటిమట్టం 803 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం 885 అడుగులుకాగా, కనిష్ట నీటిమట్టం 834 అడుగుల వరకు తాగు, సాగునీటి కోసం వినియోగించుకోవాల్సి ఉంది. ఈ సంవత్సరం ఇరు రాష్ట్రాల అవసరాలను బట్టి బుధవారం సాయంత్రానికి 803 అడుగుల వరకు నీటిని వాడినట్లు సమాచారం. రిజర్వాయర్‌లో గరిష్ట నీటి నిలువ 215 టిఎంసిలకుగాను ప్రస్తుతం 30.6 టిఎంసిలుగా నీరు నిలువ ఉంది. కృష్ణాబేసిన్ చరిత్రలో శ్రీశైలం రిజర్వాయర్‌లో నీరు లేనందున అతి తక్కువ నీటిని వినియోగించుకున్నది ఈ సంవత్సరమే. కృష్ణానది యాజమాన్య బోర్డు లెక్కల ప్రకారం ఈ సంవత్సరం రెండు రాష్ట్రాలు కలిపి తాగు, సాగు, విద్యుత్ వినియోగానికి 193 టిఎంసిల నీటిని మాత్రమే వినియోగించుకున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో ఎక్కువగా నీటిని 2002-03లో 369.764 టిఎంసిల నీటిని ఉమ్మడి రాష్ట్రంలో వినియోగించుకున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో కిందివరకు నీటిని ఉపయోగిస్తే తిరిగి వచ్చే ఖరీఫ్‌లో నీటిమట్టం కనిష్ట స్థాయికి చేరేందుకు చాలా సమయం పడుతుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.