తెలంగాణ

జనమే..జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: రాజధాని హైదరాబాద్ నుంచి సంక్రాంతికి లక్షలాది మంది సొంతూరు బాట పట్టడంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు జాతరను తలపించాయి. శనివారం నాడు ఎటుచూచినా జనం కనిపించారు. నగరవాసులు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలతోపాటు తెలంగాణ పల్లెలకు పయనమయ్యారు. సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ స్టేషన్ల వద్ద రద్దీ నెలకొంది. గమ్యస్థానం చేరుకోవడానికి ఉరుకులు పరుగులుపెట్టడం కనిపించింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో ఉదయం 6 గంటలకే ప్రయాణీకుల కిటకిటలాడింది. టిక్కెట్ల కోసం ప్రయాణీకులు ఎగబడడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రయాణికులను సముదాయించడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. వారం రోజుల నుంచి సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా అవసరాలు తీర్చలేకపోతున్నాయి. రద్దీ మాత్రం తగ్గడంలేదు. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య అధికంగానే ఉందని రైల్వే అధికారులు తెలిపారు. దేశంలోని ఇతర డివిజన్ల నుంచి రైల్వే బోగీలు అదనంగా తెప్పించినా సరిపోలేదు. గత నాలుగు రోజులుగా రెగ్యులర్ రైళ్లతోపాటు సువిధ, జన్‌సాధారణ్ బళ్లు నడుపుతున్నారు. సామాన్య ప్రయాణికులపై అదనంగా ఎలాంటి ఛార్జీల భారాన్ని మోపడంలేదన్నారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు చార్జి రూ.130, తిరుపతి నుంచి కాకినాడ టౌన్‌కు రూ. 175, విజయవాడ నుంచి విజయనగరానికి రూ.145 నిర్ణయించామని చెప్పారు. జన్‌సాధారణ్ రైళ్లు సికింద్రాబాద్ నుంచి నల్లగొండ, నడికుడి, పిడుగురాళ్ళ, గుంటూరు, విజయవాడకు చేరుకుంటాయి. ఈనెల 13వ తేదీన సికింద్రాబాద్ నుంచి విజయవాడకు 9 జన్‌సాధారణ్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. వీటికి ఎలాంటి రిజర్వేషన్లు ఉండవని చెప్పారు. ఇలా ఉండగా ఈనెల 11, 12 తేదీల్లో సుమారు 4 లక్షల మంది ప్రయాణీకులను వివిధ ప్రాంతాలకు చేరవేశామన్నారు. మరోపక్క ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్సుల సంఖ్య పెంచామని రంగారెడ్డి ఆర్టీసీ రీజియన్ మేనేజర్ యాదగిరి చెప్పారు. ఇతర ప్రాంతలకు హైదరాబాద్ నుంచి మెట్రో బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు.