ఆంధ్రప్రదేశ్‌

మూడువేల కొత్త బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: ఆంధ్రప్రదేశ్‌లో కాలం చెల్లిన బస్సుల స్థానంలో మూడు వేల కొత్త బస్సులను ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపినట్టు ఆర్టీసీ ఎండి సాంబశివరావు చెప్పారు. బుధవారం నాడు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సిఎం చెప్పారు. ప్రయాణీకులపై భారం పడకుండా వాణిజ్యపరమైన ఆదాయాన్ని పెంచుకునేలా కార్యాచరణ రూపొందించుకోవల్సిందిగా సిఎం పేర్కొన్నట్టు ఎండి తెలిపారు. ఆక్యుపెన్సీ రేషియో పెంచుకోవడంతో పాటు ఇతర మార్గాల ద్వారా ఆదాయం పెంపొదించుకుని ఆర్టీసిని లాభాల బాటలో నడిపించాలని సిఎం చెప్పారని అన్నారు. రాష్టవ్య్రాప్తంగా ప్రస్తుతం చేపట్టిన బస్ స్టేషన్ల ఆధునీకరణ పనులను సిఎం అభినందించారు. మారుమూల ప్రాంతాల్లోని బస్సు స్టేషన్లను కూడా ఆధునికీకరించాలని సిఎం ఈ సందర్భంగా సూచించారు
మూడు నగరాల్లో రిటైల్ పార్కులు
విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి నగరాల్లో రిటైల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్టు సిఎం చంద్రబాబు చెప్పారు. పట్టణ రిటైల్ పార్కులు స్వయం పోషక పట్టణాలుగా ఎదగాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రిటైల్ దుకాణాలకూ ఒకే రకమైన సైన్ బోర్డులు ఉండాలని సిఎం అన్నారు. రిటైల్ సెక్టార్‌కు చెందిన అన్ని ప్రభుత్వ శాఖలను సమీకృతం చేసి ఒక పోర్టల్ ద్వారా సింగిల్ డెస్క్ క్లియరెన్స్ అందిస్తామని చెప్పారు. కిరాణా దుకాణాల రూపురేఖలు మార్చి చిల్లర వర్తకుల ఆదాయం కూడా పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి లబ్దిదారుడికి చేరేలా ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. ప్రస్తుత ప్రజా పంపిణీ కేంద్రాలను రిటైల్ అవుట్‌లెట్స్‌గా మార్చుతామని పేర్కొన్నారు. జిల్లాల్లో మరిన్ని కిరాణా స్టోర్సు తెరవడానికి పేరొందిన రిటైల్ వర్తకులు ముందుకు రావల్సి ఉందని అన్నారు.
విద్యారంగంలో జాతీయ, అంతర్జాతీయ గీటురాళ్లను ప్రామాణికంగా తీసుకోవాలని సిఎం అన్నారు. పెమండు ల్యాబ్ సందర్శించిన సందర్భంగా సిఎం మాట్లాడారు. మండల స్థాయిలో ప్రైమరీ పాఠశాలల్లో సైతం వెబ్ ఆధారిత విద్యాబోధన జరగాలని అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలతో సర్కారీ స్కూళ్లను పోల్చి చూసి ప్రమాణాలను పెంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. రుషివ్యాలీ పాఠశాల విద్యావిధానం అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. తరగతి గదులు క్రియాత్మకంగా ఉండాలని, సెకండరీ స్కూళ్లను సాంకేతిక సహకారంతో ఎలా అభివృద్ధి చేయవచ్చో ల్యాబ్స్‌లో సిఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సిఎం స్కూళ్లలో ఎంఇఓ పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.