రాష్ట్రీయం

పవన్ చిలుక పలుకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: జన సేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ టీడీపీకి దగ్గరయ్యేందుకు చిలుక పలుకులు పలుకుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తాజాగా రూట్ మార్చి పవన్‌ను పల్లెత్తు మాట అనకుండా ప్రధాని నరేంద్ర మోదీని, తమ పార్టీని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారని సజ్జల సోమవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. సమైక్యాంధ్ర కోసం పోరాటం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించిన టీఆర్‌ఎస్ నాయకులే ఇప్పుడు పొగుడుతున్నారని పవన్ కల్యాణ్ ఆదివారం అన్నారని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర కోసం పోరాటం చేసింది గతం అని, రాష్ట్ర విభజన తర్వాత ఆ ప్రస్తావన అవసరం లేదని ఆయన అన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు లేఖ ఇస్తామనడం గొప్ప విషయమని ఆయన తెలిపారు. తాను ఏర్పాటు చేయబోయే ఫెడరల్ ఫ్రంట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య గురించి ప్రశ్నించగా, కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటైతే తాము చేరేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. పవన్ కల్యాణ్ తనకు తాను రాజకీయాలకు కొత్త అని చెప్పుకుంటున్నారని, నిజానికి పదేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారని ఆయన చెప్పారు. తనకు ఏమీ తెలియదంటే అది గొప్ప కాదని, అనర్హత అవుతుందన్నారు. పవన్ బస్సు మిస్ అయ్యిందని, విమానంలో ఇంధనం అయిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్లీ వ్యూహం మార్చారని ఆయన విమర్శించారు.
షర్మిల ఉద్దేశం అది కాదు..
తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేసిన షర్మిల ఏపీ పోలీసులపై నమ్మకం లేకే ఇక్కడ ఫిర్యాదు చేశానని చెప్పడంతో ఏపీ పోలీసు సంఘం నిరసన వ్యక్తం చేయడం గురించి ప్రశ్నించగా, పోలీసులను వ్యక్తిగతంగా అనలేదని అన్నారు. ప్రభుత్వంపై నమ్మకం లేదని, కొంత మంది పోలీసు అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నందున షర్మిల ఆ విధంగా వ్యాఖ్యానించారని సజ్జల చెప్పారు.
నవరత్నాలు కాపీ..
తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే ఏమీ చేస్తామో ప్రజలకు చెప్పేందుకు ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబు కాపీ కొట్టారని, అందుకే పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని సజ్జల విమర్శించారు.