రాష్ట్రీయం

సినీ దర్శకుడు రంగారావు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, జనవరి 14: ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, తెలుగు ఫిల్మిం అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కట్ట రంగారావు (59) అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం హైద్రాబాద్‌లోని ఆయన స్వగృహంలో మృతిచెందారు. గత కొంతకాలం నుంచి కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. రంగారావు నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండలం మేడారం గ్రామానికి చెందిన కట్ట వెంకటరామయ్య అనుసూర్యల పుత్రుడు, వృత్తిపరంగా హైద్రాబాద్‌లోని మలక్‌పేట్‌లో స్వగృహం నిర్మించుకొని నివసిస్తున్నారు. ఆయనకు భార్య వనజతో పాటు ఇరువురు కుమారులు ఉన్నారు. సినీ రంగంపై మక్కువతో సుమారు 1985 ప్రాంతంలో చెనె్నలో వివిధ దర్శకుల వద్ద సహాయకులుగా పనిచేశారు. 1989లో నేరేడుచర్లకు చెందిన నిర్మాత వల్లంశెట్ల శ్రీనివాస్‌రావు నిర్మించిన రాజశేఖర్ జీవిత జంటగా ఇంద్రధనస్సు సినిమాతో దర్శకత్వం వహించి సినీ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. 1990 సంవత్సరంలో ఉద్యమం సినిమాకు కథరచయితగా, దర్శకునిగా పనిచేసి నంది అవార్డు పొందారు. అంతేకాకుండా అలెగ్జాండర్, నమస్తే అన్న, ఆఖరి క్షణం, చెప్పుకోండిచూద్దాం, వారెవా మొగుడా, బొబ్బిలి బుల్లోడు తదితర తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇటీవల తెలుగు ఫిల్మిం అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ సినీ రంగానికి సేవలందిస్తున్నారు. రంగారావు అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ఆయన స్వగ్రామమైన నేరేడుచర్ల మండలం మేడారంలో నిర్వహించారు. ఆయన ఆకస్మిక మృతిపట్ల బంధుమిత్రులు, గ్రామస్థులు దిగ్భాంతి వ్యక్తం చేశారు. భారీ ఎత్తున బంధువులు, మిత్రులు సినీ రంగానికి చెందిన పలువురు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
సినీ దర్శకుడు కట్ట రంగారావుకు మేడారం గ్రామంలో నిర్వహించిన అంత్యక్రియల్లో ప్రముఖ సినీ దర్శకుడు ఎన్.శంకర్ పాల్గొన్నారు. రంగారావు భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ రంగారావు అత్యంత సౌమ్యుడని తెలుగు ఫిల్మిం అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా సేవంలందిస్తు పలువురి డైరెక్టర్ల ప్రశంసలు అందుకున్నారని ఆయన మృతి సినీ రంగానికి తిరని లోటని పేర్కొన్నారు. ఆయన వెంట తెలుగు ఫిల్మిం అసోసియేషన్ ప్రధానకార్యదర్శి రాంప్రసాద్, జాయింట్ డైరెక్టర్ ఎంఎస్ సభ్యులు రమేష్‌రెడ్డి, మనె్నవాసి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ సభ్యులు మామిడి నాగసైదులు పాల్గొన్నారు.
చిత్రం.. మేడారం గ్రామంలో సినీ దర్శకుడు రంగారావు మృతదేహానికి
నివాళులర్పిస్తున్న ప్రముఖ దర్శకుడు శంకర్