రాష్ట్రీయం

గృహ విద్యుత్‌కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలు పెరిగాయి. కాని గృహ విద్యుత్ వినియోగదారులకు మాత్రం ప్రభుత్వం చార్జీలు పెంచకుండా ఊరట కలిగించింది. గృహేతర, వాణిజ్య కేటగిరీ, అక్వాకల్చర్, వీధి దీపాలు, ప్రభుత్వ మంచి నీటి పథకాలు, హెచ్‌టి-3, హెచ్‌టి-6 కేటగిరీలో 2 శాతం చొప్పున చార్జీలు పెంచింది. మొత్తం మీద రూ. 213 కోట్ల మేర మాత్రమే చార్జీలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఎంపిక చేసిన కేటగిరీల్లో నాలుగు శాతం విద్యుత్ చార్జీలు పెంచాలని డిస్కాంలు చేసిన ప్రతిపాదనను పక్కనపెట్టి కేవలం రెండు శాతం మాత్రమే విద్యుత్ చార్జీలను పెంచారు.గృహ విద్యుత్ రంగంలో గతంలో మాదిరిగా పాతశ్లాబ్‌లను కొనసాగిస్తూనే కొత్తగా మూడు గ్రూపులను ఏర్పాటు చేశారు. గ్రూపు-ఏలో 900 యూనిట్లు, గ్రూపు-బిలో 2700 యూనిట్లు, గ్రూప్-సిలో 2700 యూనిట్లకుపైన విద్యుత్ వినిమయం చేసిన వారిని చేర్చుతారు.
మొత్తం 1.17 కోట్ల మంది గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నారని ఏపిఇఆర్‌సి చైర్మన్ జస్టిస్ సి భవానీ ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఈ ఏడాది మే నెలలో వచ్చే ఏప్రిల్ బిల్లును గ్రూపుల వారీగా నిర్ణయించిన చార్జీల మేరకు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.