రాష్ట్రీయం

తెలంగాణ, ఆంధ్ర రైతులు బాగుపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: ‘‘తెలంగాణ రైతులు బతకాలి, ఆంధ్ర రైతులు బతకాలి. బతుకు.. బతికించు అనేది తెలంగాణ నైజం, చంద్రబాబు నాకు మిత్రుడే, ప్రాజెక్టులపై వివరాలతో పెన్‌డ్రైవ్ పంపిస్తాను, గోదావరి జలాలు తెలంగాణ ఎంత ఉపయోగించుకున్నా కనీసం మరో రెండువేల టిఎంసిలు సముద్రంలో కలుస్తాయి, ఆంధ్ర రైతులకు మేలు జరిగే విధంగా ప్రాజెక్టులు నిర్మించుకుంటే మంచిదే’’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి శాసన సభలో గురువారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాజెక్టులతో పాటు ఆంధ్రప్రదేశ్ గురించి, అక్కడి ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. అమరావతి శంకుస్థాపన కోసం వెళ్లానని, చంద్రబాబు ఆహ్వానించారు, కలిసి భోజనం చేశాను, అప్పుడే రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం గురించి వివరించినట్టు చెప్పారు. నేనే చొరవ తీసుకుంటాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తాను అని చెప్పారు. అప్పుడు కలిసినప్పుడు పెన్‌డ్రైవ్‌లోని సమాచారం ఇవ్వలేదు, కానీ ఇప్పుడు పంపిస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించడం మంచిదేనని అన్నారు. తెలంగాణ రైతులు బతకాలి, ఆంధ్ర రైతులూ బతకాలి అనే కోణంలో తెలంగాణ ఆలోచిస్తుందని అన్నారు. మహారాష్ట్ర నిర్మించిన బ్యారేజీల వల్ల తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు సైతం సమస్యేనని అన్నారు. పరస్పర సహకారంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు అవసరం అని అన్నారు. తమ్మిడి హెట్టి వద్ద గోదావరి జలాలు 11వందల టిఎంసిలు, కాళేశ్వరం వద్ద 16వందల టిఎంసిలు, ఇంద్రావతి వద్ద 2400 టిఎంసిలు, పోలవరం వద్ద 2600 టిఎంసిలు ఉంటాయని అన్నారు. తెలంగాణ ఎంత వాడుకున్నా ఐదువందల టిఎంసిలకు మించి ఉపయోగించుకోలేదని అన్నారు. రెండువేల టిఎంసిలు సముద్రంలో కలిసిపోతాయని అన్నారు. తెలంగాణ ఎత్తులో ఉన్న ప్రాంతం కావడం వల్ల కొన్ని సమస్యలు ఉంటాయని, ఆంధ్రప్రదేశ్ దిగువన ఉన్నందున వారికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు. రెండు రాష్ట్రాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఉందామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు బిడ్డలు కూడా బాగుపడాలని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలకు నీళ్లు లభించే విధంగా నిర్ణయం తీసుకుందామని అన్నారు. రాయలసీమకు సాగునీటిని అందించే విధంగా గోదావరి జలాలలను ఉపయోగించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులను నిర్మించుకోవడానికి అవకాశం ఉందని అన్నారు. అటు నాయుడు పేట వరకు ఇటు రాయలసీమ వరకు సాగునీటిని అందించవచ్చునని అన్నారు.

చిత్రం తెలంగాణ శాసనసభలో గురువారం ప్రాజెక్టులపై కీలక ఉపన్యాసం ఇస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు