రాష్ట్రీయం

మల్లన్నకు పుష్పపల్లకీ ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం జనవరి 16: శ్రీశైలంలో జరుగుతున్న మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి పుష్పపల్లకి సేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి తెప్పత్సవం నిర్వహించారు. కనుమ సందర్భంగా బుధవారం యాగశాలలో శ్రీ చండీశ్వర పూజలు జరిపించారు. రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్కపల్లకి సేవ వైభవంగా జరిగింది. రకరకాల పుష్పాలను ఇందుకు వినియోగించారు. 300 కిలోల ఎర్రబంతి పూలు, 300 కిలోల పసుపు బంతి పూలు, 150 కిలోల తెలుపు చామంతి పూలు, 150 కిలోల ఆస్టర్ పూలు, 500 నెంబర్ల కట్‌రోజెస్, 750 నెంబర్ల జాబ్ర, 750 నెంబర్ల గ్లాడియోలాస్, వెయ్యి నెంబర్ల ఆర్కిడ్స్, 500 నెంబర్ల కార్నేషన్, 250 మీటర్ల కనకాంబరాలు, 250 మీటర్ల కాగడాలు, 150 మీటర్ల అశోక ఆకు మాల తదితర 13 రకాలకు పైగా పుష్పపత్రాలతో అలంకరించిన పల్లకిలో శ్రీ స్వామి అమ్మవార్లను ఆశీనులను చేయించారు. అనంతరం ఆలయ మాడావీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు మల్లన్న, భ్రమరాంబిక అమ్మవార్లను దర్శించుకుని తరించారు.

చిత్రాలు.. శ్రీశైలంలో జరుగుతున్న మకరసంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో ఆది దంపతులకు పుష్పపల్లకి ఉత్సవం నిర్వహిస్తున్న దృశ్యం.* శ్రీశైల మల్లన్నకు పుష్పపల్లకి సేవ.