రాష్ట్రీయం

ఐదేళ్లలో ‘ఆయుష్’ విశ్వవ్యాప్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 16: ప్రజారోగ్య పరిరక్షణలో సిద్ధ వైద్య పరిశోధన ఎంతో ఉపయోగకరం కావాలని కేంద్ర ఆయుష్ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ ఆకాంక్షించారు. బుధవారం తిరుపతి స్విమ్స్ ఆవరణలో సిద్ధ పరిశోధన కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి అద్దం పట్టే సిద్ధ వైద్యం పట్ల పేద ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధ వైద్యాన్ని దేశ వ్యాప్తంగా విస్తరింపజేసేందుకు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఇప్పటికే దేశంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, కేంద్రపాలిత పాంత్రాలైన పాండిచ్చేరి, ఢిల్లీలో ఏడు సిద్ధ వైద్య పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నేడు స్విమ్స్‌లో 8వ సిద్ధ వైద్య పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆధునిక వైద్య విధానం, సంస్కృతి సాంప్రదాయాలతో కూడుకున్న వైద్య విభాగం అనుసంధానంగా జరిగే పరిశోధనలు ప్రజారోగ్యాన్ని పరిరక్షించే విధంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి అని తెలిపారు. అంటే భారతీయ సంస్కృత, సాంప్రదాయాలకు సంబంధించిన ఆరోగ్య పరిరక్షణతో కూడుకున్న వైద్య విధానమే ఆయుష్ అని చెప్పారు. ప్రజారోగ్య రక్షణ కోసం ప్రధాని మోదీ ఇందుకు ప్రత్యేక శాఖను కూడా కేటాయించారన్నారు. ఇప్పటికే భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ వైద్య విధానాలు ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాయన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో శాశ్వత సభ్యత్వం కలిగిన ఆయుష్ రానున్న ఐదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా తన వైద్య సేవలను విస్తరించనుందని కేంద్ర మంత్రి యశో నాయక్ చెప్పారు. వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు అద్భుతమైన వైద్య విధానాలతో వారి ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్నారని తెలిపారు. సిద్ధ వైద్యాన్ని నేటి ప్రపంచ ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. స్విమ్స్‌తో కలిసి సిద్ధ వైద్య పరిశోధన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సైతం తన సంపూర్ణ సహకారం అందించి అవసరమైన స్థలం కేటాయించాలని, ప్రాంతీయ పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చెందడానికి సహకరించాలన్నారు. స్విమ్స్, సీసీఆర్‌ఎస్ సంయుక్త పరిశోధనలు మరింత సత్ఫలితాలను సాధించాలని, మానవుల ఆరోగ్య పరిరక్షణలో ప్రగతిని సాధించాలని ఆకాంక్షించారు. సీసీఆర్‌ఎస్ డైరెక్టర్ జనరల్ ఆచార్య డాక్టర్ కె.కనకవల్లి మాట్లాడుతూ సిద్ధ క్లినికల్ రీసెర్చ్ యూనిట్ ఏర్పాటుకు సహకరించిన టీటీడీ ఈఓ, జిల్లా కలెక్టర్, స్విమ్స్ డైరెక్టర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ దేశంలో ఇప్పటికే ఆయుర్వేదం ద్వారా ప్రజలకు మంచి వైద్యం అందుతోందన్నారు. దీంతోపాటు సిద్ధ క్లినికల్ రీసెర్చ్ యూనిట్ అందుబాటులోకి రావడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చినట్లేనని చెప్పారు.