రాష్ట్రీయం

ఏపీ అంటే మోదీకి అసూయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అంటే ప్రధాని మోదీకి అసూయ అని, అభివృద్ధిలో గుజరాత్‌ను ఏపీ మించిపోతుందన్న భయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎలక్షన్ మిషన్ - 2019 టీడీపీ బాధ్యులు, ప్రజాప్రతినిధులతో ఉండవల్లిలోని తన నివాసం నుంచి గురువారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ అభివృద్ధి చెందకూడదన్నది తెలంగాణ సీఎం కేసీఆర్ పంతమని, ఆయన చేతగానితనం బయటపడుతుందని భయమంటూ తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లాల్సి వస్తుందని వైకాపా అధినేత జగన్‌కు భయమన్నారు. అసూయాపరులంతా ఒకేచోటుకు చేరి ఏపీపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. గద్దల మాదిరిగా ఏపీపై వాలి కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, మతాల మధ్య ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సెంటిమెంట్ రెచ్చగొట్టారని, ఇప్పుడు ఏపీలో కులాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగిస్తున్నారన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌కు స్పందన లేదని, దీంతో బుధవారం హడావుడిగా జగన్‌తో కేటీఆర్ భేటీ అయ్యారని ఎద్దేవా చేశారు. ఈ భేటీతో వైకాపా, టీఆర్‌ఎస్ ముసుగులు తొలగిపోయాయన్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చాలని వారు కుట్రలు పన్నుతున్నారన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కాకుండా కుతంత్రాలు పన్నుతున్నారని విమర్శించారు. బీజేపీ అజెండా అమలుకే ఫెడరల్ ఫ్రంట్ అని, పార్టీలను గందరగోళంలోకి నెట్టి, ప్రజల్లో అయోమయం సృష్టించే ప్రయత్నమని ఆక్షేపించారు. వైకాపా నేత షర్మిల టీడీపీపై పోలీసులకు ఫిర్యాదు చేయడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి ఖండించారు. సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేసింది వైకాపానేనని, సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం చేసింది ఆ పార్టీనేని స్పష్టం చేశారు. సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణపై కూడా మొదట్లో వైకాపా దుష్ప్రచారం చేసిందని గుర్తుచేశారు. జగన్‌పై విచారణ సాగకుండా చేయాలని కుట్రలు పన్నారన్నారు. దర్యాప్తు అధికారులను ఇబ్బందులకు గురిచేశారన్నారు. చివరికి న్యాయమూర్తులపై కూడా దుష్ప్రచారానికి తెగబడ్డారని విమర్శించారు. పవన్‌కళ్యాణ్ పెళ్లిళ్లపై అసభ్య ప్రచారం చేశారని, టీడీపీ మహిళా నేతలపై కూడా అసభ్యంగా మాట్లాడారన్నారు. తన కుటుంబ సభ్యులపై కూడా దుష్ప్రచారం చేశారని గుర్తుచేశారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే సహించేది లేదని, పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
ఏపీ పర్యటనలో టీఆర్‌ఎస్ నేత తలసాని శ్రీనివాస యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో మొక్కులు చెల్లించేందుకు వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ నేతల ఏపీ పర్యటనల్లో టీడీపీ నేతలు పాల్గొనవద్దని సూచించారు. ఎవరైనా పాల్గొంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. బంధుత్వాలు ఉంటే ఇంట్లో చూసుకోవాలని, స్నేహాల పేరుతో పార్టీని పణంగా పెట్టవద్దని హితవు పలికారు. ప్రజాప్రయోజనాలను దెబ్బతీసే చర్యలు సహించనన్నారు. తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారని, ఇక్కడకు వచ్చి ఆదే బీసీలపై కపటప్రేమ చూపుతున్నారని విమర్శించారు. 26 కులాలకు అన్యాయం చేసిన టీఆర్‌ఎస్‌తో జగన్ అంటకాగుతున్నారని, వైకాపాకు బీసీలే బుద్ధి చెప్పాలన్నారు. అవినీతి గొంగళి పురుగును కేసీఆర్ కౌగిలించుకున్నారని, అవినీతి నేతతో స్నేహం తెలంగాణ కోసమేనా అనే విషయంపై కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు జవాబు చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు.