రాష్ట్రీయం

నాలెడ్జికి చిరునామా నవ్యాంధ్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 17: భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్ నాలెడ్జికి చిరునామాగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని అమరావతిలోని ఐనవోలు వద్ద గురువారం దేశంలోని బిజినెస్ స్కూల్స్‌లో ఒకటైన జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ) క్యాంపస్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రముఖ
మేనేజ్‌మెంట్ స్కూల్ ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ దక్షిణ భారతదేశంలో తొలి క్యాంపస్‌ను అమరావతిలో నెలకొల్పుతోందని చెప్పారు. దీని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఈరోజు చాలా మంచిరోజన్నారు. ప్రభుత్వం 50 ఎకరాల భూమి ఇస్తే రూ. 235 కోట్ల వ్యయంతో ఇక్కడ క్యాంపస్ నిర్మిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే విట్, ఎస్‌ఆర్‌ఎం, అమృత వంటి యూనివర్సిటీలు రాష్ట్రానికి వచ్చాయని, ఇప్పుడు ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ కూడా వచ్చిందన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్రం ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఏఐఎంఎస్ వంటి 11 విద్యా సంస్థలను ఏర్పాటు చేయవలసి ఉందన్నారు. వాటికోసం 2,912 ఎకరాల భూమి కేటాయించినట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలో ప్రారంభించిన కియా మోటార్స్ తొలి కారు ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 29న రోడ్డెక్కనున్నట్లు వెల్లడించారు. ఈ సంస్థ కూడా 8నెలల్లో క్యాంపస్ నిర్మాణం పూర్తి చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐకు ప్రభుత్వం, సీఆర్‌డీఏ నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, నామినేటెడ్ ఎమ్మెల్యే ఫిలిప్స్ సీ టాచర్, గుంటూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జానీమూన్, మంగళగిరి మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, జిల్లా కలెక్టర్ కోన శశిధర్, సీఆర్‌డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం..రాజధాని ప్రాంతంలో ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరిస్తున్న సీఎం చంద్రబాబు