రాష్ట్రీయం

సభాపతిగా పోచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: తెలంగాణ రాష్ట్ర శాసనసభకు రెండో స్పీకర్‌గా మాజీ మంత్రి, బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికపై శుక్రవారం అధికారికంగా ప్రకటించిన అనంతరం పోచారం బాధ్యతలు స్వీకరిస్తారు. స్పీకర్ ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ వెలువడగానే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రతిపాదించిన పోచారం అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించగా, పాలకపక్షానికి మిత్రపక్షమైన ఎంఐఎం బలపరిచింది. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలని ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగానే చేసిన విజ్ఞప్తి మేరకు అన్ని పక్షాలు కూడా మద్దతు పలికాయి. స్పీకర్ ఎన్నికకు నామినేషన్ దాఖలుకు గడవు ముగిసే వరకు పోచారం ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు శుక్రవారం అధికారికంగా ప్రొటెం స్పీకర్ ముంతాజ్ ఖాన్ ప్రకటిస్తారు. ఆ తర్వాత సభా నాయకుడు, సీఎం కేసీఆర్‌తో పాటు ఇతర పక్షాల నేతలు స్వయంగా పోచారంను స్పీకర్ సీట్లో
కూర్చోబెట్టడంతో స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత సభను ఉద్దేశించి స్పీకర్ ప్రసంగించడం, సభ్యులు స్పీకర్‌కు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం సభ వాయిదా పడుతుంది. అనంతరం స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశమై సమావేశాల కార్యాచరణను ఖరారు చేస్తుంది. ఇలా ఉండగా స్పీకర్‌గా తనను ఎంపిక చేయడం పట్ల శాసనసభ ఆవరణలోని ముఖ్యమంత్రి కేసీఆర్ ఛాంబర్‌కు వెళ్లి పోచారం కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభ మొదటి రోజు సమావేశాలు, స్పీకర్ నామినేషన్ కార్యక్రమాల అనంతరం జూబ్లీహాల్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సీఎం కేసీఆర్ భోజనం చేశారు. ఆ తర్వాత అదే హాల్‌లోని శాసనమండలి భవనం, ప్రాంగణానికి ఇటీవల చేసిన మరమ్మతులు, అలంకరణను సభ్యులతో కలిసి సీఎం పరిశీలించారు.
పోచారం రాజకీయ జీవితం...
తెలంగాణ శాసనసభ రెండో స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా బాన్స్‌వాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వరుసగా ఆరుసార్లు ఎన్నికయ్యారు. అంతకుముందు 1976లో వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షునిగా పోచారం రాజకీయ జీవితం ప్రారంభమై, 1987లో డిసీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తొలిసారిగా 1994లో బాన్స్‌వాడ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. 1998లో గృహనిర్మాణ మంత్రిగా, 1999లో గనులశాఖ మంత్రిగా, 2000లో పంచాయతీరాజ్ మంత్రిగా, 2011 నుంచి 2014 వరకు వ్యవసాయశాఖ మంత్రిగా పోచారం బాధ్యతలు నిర్వహించి, 2019లో శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
చిత్రం..స్పీకర్ ఎన్నికకు నామినేషన్ పత్రాలు అందజేస్తున్న అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి. చిత్రంలో సీఎం కేసీఆర్. భట్టి విక్రమార్క తదితరులు