రాష్ట్రీయం

ఇక రాహుల్‌దే నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: శాసనసభా కాంగ్రెస్ పక్షం నాయకుడిని (సీఎల్‌పీ) ఎంపిక నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అప్పగిస్తూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏకవాక్య తీర్మానం చేశారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. సీఎల్‌పీ నాయకుడి ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. శాసనసభ ప్రారంభానికి ముందు గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ పరిశీలకుడు వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఆర్‌సి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలతో పార్టీ పరిశీలకుడు వేణుగోపాల్ విడివిగా సీఎల్‌పీ నేతగా ఎవరుండాలనే అంశంపై అభిప్రాయాలను సేకరించారు. సీఎల్‌పీ నేతగా తమకు అవకాశం ఇవ్వాలని ఎల్‌బి నగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ పరిశీలకునిగా విజ్ఞప్తి చేశారు. అలాగే పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని వారు స్పష్టం చేసినట్టు సమాచారం. అలాగే మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని విడివిడిగా, ఉమ్మడిగా పార్టీ పరిశీలకునిగా స్పష్టం చేశారు. అనంతరం ఇదే విషయాన్ని శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఏఐసీసీ పరిశీలకుడు వేణుగోపాల్ మీడియాకు తెలిపారు. తమ పార్టీ సభ్యులంతా సీఎల్‌పీ నాయకుడి ఎన్నిక నిర్ణయాన్ని పార్టీ అధినేత రాహుల్‌గాంధీకి అప్పగిస్తూ ఏక వ్యాఖ్య తీర్మానం చేశారని ఆయన తెలిపారు. ఈ తీర్మానాన్ని పార్టీ అధిష్ఠానంకు తెలియజేయనున్నట్టు వివరించారు.

చిత్రం..హైదరాబాద్‌లో విలేఖరులతో మాట్లాడుతున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, కుంతియా, ఉత్తమ్ తదితరులు