రాష్ట్రీయం

మీలా శవరాజకీయాలు చేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శవరాజకీయాలు చేయడంలో దిట్టఅని అలాంటివి తాము చేయలేమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ చంద్రబాబును చూస్తేనే ఆయన ఎలాంటివారో చెప్పేయవచ్చని చమత్కరించారు. ‘తెలంగాణలో మీరు రాజకీయాలు చెస్తే సంసారం. అదే మేం ఆంధ్రాలో రాజకీయాలు చేస్తే వ్యభిచారామా?’ అంటూ నిప్పులు చెరిగారు. ఆయనెప్పుడూ మోసపూరిత రాజకీయాలు చేస్తారని తలసాని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూసేది ఒక్క చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎంలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దొంగ రాజకీయాలు చేయరని ఆయన స్పష్టం చేశారు. కాగా ఏపీలో ఒక్క యాదవ సంఘానికే కాదు, అన్ని బీసీ సంఘాలకు తాము చేయూతనిస్తామని తలసాని ప్రకటించారు. తెలంగాణ వాళ్ల బంధాలు, బంధుత్వాల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఆయన విమర్శించారు. తాము దేవాలయాల వద్ద రాజకీయాలు చేయమని, అలా చేయదల్చుకుంటే ఎన్నికల బరిలో తేల్చుకుంటామని తలసాని హెచ్చరించారు. ఫెడరల్ ఫ్రంట్ లేదంటున్న చంద్రబాబుకు ఫ్రంట్ అంటే ఏమిటో త్వరలో తెలుస్తుందని ఆయన తెలిపారు. బాబు పదేపదే చిల్లర రాజకీయాలు చేస్తే తమ సమాధానాలు చాలా దీటుగా ఉంటాయని ఆయన చెప్పారు. మరో 15 రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రాకు వస్తారని, అప్పుడు దమ్ముంటే ప్రతాపం చూపించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సవాల్ చేశారు. ప్రజల సొమ్ములను ప్రకటనల పేరుతో వృథా చేస్తోంది బాబేనని ఆయన ఆరోపించారు. కులాల మధ్య గొడవలు పేట్టేది ఆయనేనని ఇది అందరికీ తెలిసిందేనని ఆయన విమర్శించారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో మీరు సీఎంగా ఉన్నప్పుడు నీళ్లు, కరెంటు లేదు. ప్రస్తుతం నీళ్లు, కరెంట్ సమస్య లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కింది’అని తలసాని వ్యాఖ్యానించారు. ఫెడరల్ ఫ్రంట్‌పై ఆంధ్రా మంత్రులు అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఊసరవెల్లి కూడా ఏపీ సీఎంను చూస్తే సిగ్గు పడుతుందని ఆయన చలోక్తి విసిరారు. ఆంధ్రాలో 100 శాతం రాజకీయాలు చేస్తామని తలసాని ప్రకటించారు. లోటు ఆదాయం ఉన్న ఆంధ్రాలో నవ నిర్మాణ దీక్షతో వందల కోట్ల వృథా చేస్తున్నారని చెప్పారు. ఏపీ సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా తాను అక్కడ పర్యటించానని ఆయన గుర్తు చేశారు.