రాష్ట్రీయం

ఫెడరల్ ఫ్రంట్ శూన్యం: బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఫెడరల్ ఫ్రంట్ అనేది ఓ శూన్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కోల్‌కతాలో బీజేపీయేతర ఐక్యఫ్రంట్ ర్యాలీకి 20కి పైగా పార్టీల నాయకులు హాజరయ్యారు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ తప్ప అంతా వచ్చారు.. ఇక్కడికి వచ్చిన వారంతా ప్రధాని మోదీ వ్యతిరేకులే.. కేసీఆర్, జగన్‌లు మోదీ వెంటే ఉన్నారనేది దీనిని బట్టి స్పష్టమవుతోంది.. ఇక ఫెడరల్ ఫ్రంట్ అనేది ఓ శూన్యం.. మోదీకి మద్దతు కోసమే ఆ ఫ్రంట్.. అదసలు బీజేపీకి ప్రతిపక్షమేకాదని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శనివారం కోల్‌కతా నుంచి ఏపీలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ
ఇన్‌చార్జిలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలక్షన్ మిషన్-2019 పార్టీ లక్ష్యం కావాలన్నారు. ఎన్టీఆర్ 23వ వర్ధంతిని సంకల్ప దినంగా జరిపినందుకు అభినందనలు తెలిపారు. ఎలక్షన్ మిషన్ 2019 లక్ష్యాలను అధిగమించాలని దిశానిర్దేశం చేశారు. మొత్తం 25 ఎంపీ, 150 అసెంబ్లీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీశ్రేణులు పనిచేయాలని ఆదేశించారు. టీఆర్‌ఎస్ నేతల ఆంధ్రా ద్వేషాన్ని ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్‌రావులు చేసిన వ్యాఖ్యలు, దుర్భాషలను ప్రజలకు ప్రత్యక్షంగా వివరించాలన్నారు. వారితో అంటకాగుతున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. వరంగల్‌లో తనపైన రాళ్లేసిన వాళ్లతో జగన్ లాలూచీ పడుతున్నారని, అక్రమాస్తుల కోసమే కేసీఆర్‌తో మిలాఖత్ అయ్యారని విమర్శించారు. వైసీపీ లాలూచీ రాజకీయాలను మరోసారి ప్రచారం చేయాలన్నారు. డబ్బులు పెట్టే అభ్యర్థుల కోసం వైసీపీ వెదుకుతోందన్నారు. వైసీపీ అభ్యర్థులు ప్రజల్లో ఉండేవారు కారన్నారు. డబ్బు కోసమే వైసీపీ రాజకీయం చేస్తోందని, ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మార్చిందని మండిపడ్డారు. ఏపీకి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చామని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు గాయంపై కారం చల్లేవిగా ఉన్నాయని ధ్వజమెత్తారు. దేశంలోని ఆలయాల్లో బీజేపీ అశాంతిని సృష్టిస్తోందని శబరిమలలో ఉద్రిక్తతలను రెచ్చకొడుతోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే రామజన్మభూమిని మరోసారి తెరపైకి తెస్తోందని ఆక్షేపించారు. మతపరమైన వివాదాలు రెచ్చకొట్టే ఆ పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. కర్ణాటకలో బీజేపీ దుర్మార్గ రాజకీయాలు చేస్తోంది.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది.. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు తెరదీశారు.. కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు జరుగుతున్నాయని చంద్రబాబు నిప్పులు చెరిగారు. వీటిని తిప్పికొట్టే విధంగా ప్రజలను చైతన్యపరచాలని పార్టీ శ్రేణులకు నిర్దేశించారు. ఇంటింట ప్రచారంతో పాటు సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు ఓ చారిత్రక మలుపులో ఉన్నామని ఈ కూడలిలో ఏ మాత్రం ఏమరపాటుగా ఉండరాదని హెచ్చరించారు. ఆదాయం ఉన్న తెలంగాణలో పల్లెలు ఎలా ఉన్నాయి.. పట్టణాల్లో ఏం అభివృద్ధి జరిగింది..? ఆదాయం లేకున్నా ఆంధ్రప్రదేశ్‌లో పల్లెలు, పట్టణాల్లో ఏ రకంగా అభివృద్ధి జరిగిందో బేరీజు వేస్తూ ప్రచారం నిర్వహించాలన్నారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో ముస్లింలకు అండగా నిలిచామని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి భారీగా నిధులు మంజూరు చేశామన్నారు. వీటన్నింటినీ ప్రజలకు వివరించాలని పునరుద్ఘాటించారు. ఓటర్ల జాబితాను అందరికీ అందుబాటులో ఉంచామని మార్పులు, చేర్పులపై అంతా శ్రద్ద చూపాలని కోరారు. ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

చిత్రం..కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి భారీగా తరలివచ్చిన జనం