రాష్ట్రీయం

దుమ్మురేపిన తెలుగు రత్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: జాతీయ స్థాయిలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర సర్వోన్నత సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ మొట్టమొదటిసారి నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో తెలుగు విద్యార్థులు దుమ్మురేపేశారు. జాతీయ స్థాయిలో రూపొందించిన టాప్ -15 ప్రాధమిక జాబితాలో తెలంగాణ నుండి నలుగురు, ఆంధ్రా నుండి ఒకరు చోటు చేసుకున్నారు. ఐఐటీ జేఈఈని ఈసారి నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ రెండు మార్లు నిర్వహించనుంది. తొలిసారి జనవరిలో నిర్వహించిన ఫలితాలను శనివారం నాడు విడుదల చేసింది. మరోమారు ఏప్రిల్ 8 నుండి 12 వరకూ ఆన్‌లైన్‌లో నిర్వహించనుంది. నార్మలైజేషన్ పద్ధతిలో జనవరిలో నిర్వహించిన పరీక్ష పర్సంటైల్‌ను విడుదల
చేసింది. సబ్జెక్టుల వారీ, సెషన్‌ల వారీ నార్మలైజేషన్ చేసిన ఎన్‌టీఏ అన్ని సెషన్లు కలిపి మొత్తం మీద మళ్లీ నార్మలైజేషన్ చేసి ర్యాంకులను ఇచ్చింది. దీనిని అర్ధం చేసుకోవడంలో అయోమయానికి గురైన విద్యార్థులు తమకు వచ్చిన పర్సంటైల్‌లో పొరపాటు జరిగిందని భావించారు. వాస్తవానికి లోతైన అధ్యయనం చేస్తే తప్ప నార్మలైజేషన్ ప్రాసెస్ అర్ధం కాదని విద్యానిపుణులు చెబుతున్నారు.
రెండోసారి ఏప్రిల్‌లో ఎన్‌టీఎ ఐఐటీ జేఈఈ నిర్వహించిన తర్వాతనే తుది ఫలితాలను ప్రకటించి అనంతరం ఉమ్మడి ర్యాంకుల జాబితాను ఏప్రిల్ చివరి వారంలో ప్రకటించనుంది.
తొలి పరీక్షలో దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థుల జాబితాలోనూ తెలంగాణ నుండే గరిష్టంగా నలుగురు ఆ విజయాన్ని దక్కించుకున్నారు.జాతీయ స్థాయిలో మధ్యప్రదేశ్‌కు చెందిన ధృవ అరోరా అగ్రస్థానంలో నిలవగా, తెలంగాణ నుండి ఆదెళ్ల సాయికిరణ్, ఆంధ్రా నుండి బొజ్జా చేతన్ రెడ్డి అగ్రస్థానంలో నిలిచారు. 100 పర్సంటైల్ సాధించుకున్న వారిలో తెలంగాణ నుండి ఆదెళ్ల సాయి కిరణ్, ఇందుకూరి జంయత్ ఫణి సాయి, విశ్వనాధ్ కే, బట్టెపాటి కార్తికేయ తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొజ్జ చేతన్ రెడ్డి కూడా ఉన్నారు.
ఐఐటీ జేఈఈ మెయిన్స్‌కు 9.41 లక్షల మంది వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోగా, అందులో 9,29,198 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో గత 8వ తేదీ నుండి 12వ తేదీ వరకూ నిర్వహించిన ఆన్‌లైన్ పరీక్షకు 8,74,469 మంది హాజరయ్యారు. ఇందులో అబ్బాయిలు 3,19,834 మంది కాగా అమ్మాయిలు 1,32,638 మంది ఇద్దరు ట్రాన్స్ జండర్లున్నారు. అబ్బాయిల్లో ఎస్సీలు 63,152 మంది, ఎస్టీలు 25,506 మంది, ఓబీసీలు 2,51,995 మంది, అలాగే అమ్మాయిల్లో ఎస్సీలు 22,913 మంది, ఎస్టీలు 9369 మంది, ఓబీసీలు 1,03,786 మంది హాజరయ్యారు.
100 పర్సంటైల్ సాధించిన వారు:
టాప్ 45 ర్యాంకర్లలో 15 మంది మాత్రమే 100 పర్సంటైల్ సాధించారు. అందులో ఆంధ్రా నుండి బొజ్జ చేతన్ రెడ్డి, మధ్యప్రదేశ్‌కు చెందిన ధృవ అరోరా, మహారాష్టక్రు చెందిన గుప్త కార్తికేయ చంద్రేశ్, మహారాష్ట్ర రాజ్ ఆర్యన్ అగర్వాల్, పంజాబ్‌కు చెందిన జయేష్ సింగ్లా, రాజస్థాన్‌కు చెందిన సాంబిట్ బెహరా, తెలంగాణకు చెందిన ఆదెళ్ల సాయి కిరణ్, ఇందుకూరి జయంత్ ఫణి సాయి, భూపతి కార్తికేయ, యూపీకి చెందిన హిమాంశు గౌరవ్ సింగ్, నామన్ గుప్త ఉన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ మినహా మిగిలిన ఏ రాష్ట్రం నుండీ నలుగురు నూరు శాతం పర్సంటైల్ సాధించలేదు. తెలంగాణ విద్యార్థులు ఇదో కొత్త రికార్డును సృష్టించారు.
*
జాతీయ టాపర్ల జాబితా
*
ర్యాంకు పేరు(రాష్ట్రం)
*
1 ధృవ అరోరా(మధ్యప్రదేశ్)
2 రాజ్ ఆర్యన్ అగర్వాల్ (మహారాష్ట్ర)
3 ఆదెళ్ల సాయి కిరణ్ (తెలంగాణ)
4 బొజ్జ చేతన్ రెడ్డి(ఆంధ్రప్రదేశ్)
5 సాంబిట్ బెహరా(రాజస్థాన్)
6 నామన్ గుప్త(ఉత్తరప్రదేశ్)
7 ఇందుకూరి జయంత్ ఫణి సాయి(తెలంగాణ)
8 విశ్వనాధ్ కే(తెలంగాణ)
9 హిమాంశు గౌరవ్ సింగ్ (యూపీ)
10 కేవిన్ మార్టిన్ (కర్నాటక)
11 శుభాంకర్ గంభీర్ (రాజస్థాన్)
12 బట్టెపాటి కార్తికేయ(తెలంగాణ)
13 అంకిత్ కుమార్ మిశ్రా(మహారాష్ట్ర)
14 జయేష్ సింగ్లా(పంజాబ్)
15 గుప్త కార్తికేయ చంద్రేష్ (మహారాష్ట్ర)
*
చిత్రాలు..ధ్రువ అరోరా *సాయికిరణ్ *జయంత్ ఫణి సాయి
*కె. విశ్వనాథ్ *బి. కార్తికేయ *బి. చేతన్‌రెడ్డి