రాష్ట్రీయం

నెత్తురోడిన రాదార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: తెలంగాణలోని మూడు జిల్లాల్లో గురువారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా పరిథిలోని ఔటర్‌రింగ్‌రోడ్డుపై లారీకి నిప్పంటుకోవడంతో ఆర్పే ప్రయత్నం చేస్తున్నవారిపైనుంచి మరోలారీ దూసుకువెళ్లడంతో ముగ్గురు మరణించారు. పెండ్లిపత్రికలు పంచడానికి వెళ్లివస్తూ ప్రమాదానికి గురై మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. కాగా కరీంనగర్ జిల్లాలో పెళ్లిమొక్కు తీర్చుకునేందుకు వెళుతూ ప్రమాదానికి గురై మరో ముగ్గురు మరణించిన సంఘటన విషాదం మిగిల్చింది.
ప్రమాదాన్ని అడ్డుకుని...
నార్సింగి: రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డుపై శంకరపల్లి మండలం మీర్జాగూడ వద్ద ఓ లారీ, బోలెరో వాహనం ఢీకొనగా ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. శంషాబాద్ నుంచి పటాన్‌చెరు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మెదక్ జిల్లా జహిరాబాద్ మండలం సిరాజ్‌పల్లికి చెందిన లారీడ్రైవర్ ప్రవీణ్ (26), క్లీనర్లు ప్రశాంత్ (26), సునిల్ (25) ఒకే గ్రామానికి చెందిన వారు. వీరంతా లారీలో కర్ణాటకకు బయలుదేరారు. ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా వెళుతుండగా వెనుక భాగంలో నిప్పంటుకుంది. రాజేంద్రనగర్‌కు చెందిన టిల్లువర్మ (24) బొలెరో వాహనంలో వెళుతూ లారీలో మంటలు చెలరేగుతుండటాన్ని చూసి వారిని హెచ్చరించాడు. దాంతో లారీని ఆపి మంటలను ఆర్పుతుండగా వెనుకనుంచి అతివేగంతో వచ్చిన మరో లారీ ఈ నలుగురిని ఢీకొంది. ఈ సంఘటనలో టిల్లువర్మతోపాటు ప్రవీణ్ అక్కడిక్కడే మృతి చెందగా చికిత్స పొందుతూ ప్రశాంత్ మృతి చెందాడు. సునీల్ పరిస్థితి విషమంగా ఉంది.
మొక్కు తీర్చుకునేందుకు వెళ్లి..
కమలాపూర్: పెళ్లిమొక్కులు తీర్చుకునేందుకు వేములవాడ బయలుదేరిన రెండు కుటుంబాలు ప్రమాదానికి గురై ముగ్గురిని కోల్పోయారు. వరంగల్ జిల్లా పొనగల్లుకు చెందిన చిలుకూరి సాంబయ్య, నంబూల జంపయ్య కుటుంబాలకు చెందిన పదిమంది జీపులో బయలుదేరారు. కమలాపూర్ మండలం వంగపల్లి క్రాస్‌రోడ్డు వద్ద బొగ్గులారీ వీరి వాహనాన్ని ఢీకొట్టడంతో చిలుకూరి సమ్మక్క, నంబూల మల్లక్క, జీపు డ్రైవర్ ముదస్తు రాకేష్ అక్కడికక్కడే మరణించారు. సాంబయ్య, సారమ్మ, నంబులరాజు, జంపయ్యలకు గాయాలుకాగా వరంగల్ తరలించి చికిత్స అందిస్తున్నారు.
పెండ్లి పత్రికలు పంచుతూ..
తుర్కపల్లి: పెండ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన ముగ్గురు యువకులు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటన నల్గొండ జిల్లా ముల్కలపల్లిలో జరిగింది. ఏప్రిల్ 3న జరగాల్సిన వివాహానికి పిలవడానికి మోటార్ సైకిల్‌పై బయలుదేరిన బానావత్ గణేశ్, బానోతు మల్లేశ్, మాడావత్ సాయికుమార్‌లను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలతో వారు ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. మరో మూడు రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఈ ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది.

చిత్రం కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలంలో జీపుని ఢీకొని బోల్తాపడిన బొగ్గు లారీ