రాష్ట్రీయం

24గంటలూ విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 20: ఆంధ్ర రాష్ట్రంలో 24 గంటలూ అంతరాయాల్లేని విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖామంత్రి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 13వ రాష్ట్ర మహాసభలు ఆదివారం ఏయూ సిఆర్ రెడ్డి కాన్వొకేషన్ హాలులో జరిగాయి. మహాసభల్లో ముఖ్యఅతిథిగా మంత్రి కళావెంకట్రావు మాట్లాడుతూ విద్యుత్ పంపిణీ నష్టాలను 15శాతం నుంచి 9.2 శాతానికి తగ్గించగలిగామని, దీనివల్ల రూ.360 కోట్ల మేర మిగులుతోందన్నారు. 20వేల మంది విద్యుత్‌శాఖ తాత్కాలిక ఉద్యోగుల వేతనాలను పెంచామన్నారు. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలాకి శ్రీనివాసరావు మాట్లాడుతూ 2018 విద్యుత్ సవరణ చట్టం గుదిబండగా మారిందన్నారు. క్రిమిలేయర్ ఎవరికీ లేదని, బీసీలకే ఇచ్చారని, దీనివల్ల విద్య, ఉద్యోగ అవకాశాలు రావడంలేదని ఆందోళన వ్యక్తంచేశారు. క్రిమిలేయర్‌ను రద్దు చేస్తే తప్ప బీసీలకు వాటా దక్కదన్నారు.
ఏపీట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు సంబంధించిన బీసీ విద్యుత్ సంక్షేమ సంఘానికి ఎక్కడా గజం స్థలం లేదన్నారు. పలు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీటిని మంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ సందర్భంగా మంత్రి కిమిడి కళా వెంకట్రావును అసోసియేషన్ తరపున ఘనంగా సత్కరించారు. 2019 డైరీని మంత్రులు గంటా శ్రీనివాసరావు, కళావెంకట్రావు ఆవిష్కరించారు.

చిత్రం..విద్యుత్ ఉద్యోగుల డైరీని ఆవిష్కరిస్తున్న రాష్ట్ర మంత్రులు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు