రాష్ట్రీయం

శరవేగంగా కోటిపల్లి-నర్సాపూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వరి, కొబ్బరి పంటలకు పేరుపొందిన కోనసీమ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద చెన్నై-కోల్‌కతా రైలుమార్గాన్ని అనుసంధానం చేసే కోటిపల్లి-నర్సాపూర్ కొత్త రైలుమార్గం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2000-11 ఆర్థిక సంవత్సరంలో రూ.2,012 కోట్ల అంచనాతో మంజూరైన 57 కి.మీల విడివి కలిగిన ఈ రైలుమార్గం నిర్మాణ పనులను రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే ప్రగతి సమీక్ష సమావేశాల్లో సైతం ఈ ప్రాజెక్టు పురోగతిపై చర్చిస్తున్నారు. ఆంధ్ర ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం ఈ రైలుమార్గం. ఈ మార్గం కోనసీమకు సారవంతమైన భూములున్న గ్రామాల మీదుగా సాగుతుంది. అమలాపురం, పేరూరు, పాశర్లపూడి, జగ్గంపేట, రాజోలు పట్టణాలను కలుపుతుంది. 2014 నుంచి ఇప్పటివరకు రూ.325 కోట్లు
ఖర్చయింది. ఈ ప్రాజెక్టు విజయవాడ - భీమవరం - నిడదవోలు బ్రాంచ్ లైన్‌కు సరికొత్త ప్రత్యామ్నాయం అవుతుంది. క్రమేణా ఈ మార్గం భీమవరం నుంచి నర్సాపూర్‌కు విస్తరిస్తుంది. నర్సాపూర్ - కాకినాడ రైల్వేలైన్‌తో అనుసంధానం అవుతుంది. ఈ ప్రాంతంలో ఓఎన్జీసీ ద్వారా ఉత్పత్తి అయ్యే సహజ వాయువు ఆధారిత విద్యుత్ కేంద్రం, అనేక రిఫైనరీలు నిర్మితమవుతాయి. కాకినాడ నుంచి అమలాపురం, రాజోలు వంటి వాణిజ్య పట్టణాల మధ్య దూరం 45 కి.మీలు తగ్గిపోయి ప్రజలు గోదావరి నదిని పడవలో దాటాల్సిన అవసరం తప్పుతుంది. ఈ ప్రాజెక్టు మూడు దశల్లో పూర్తికానుంది. నర్సాపూర్ - చించినాడ (10 కి.మీ), కోటిపల్లి - అమలాపురం (12.70 కి.మీ), అమలాపురం - చించినాడ (33.88 కి.మీ) మార్గాలు ప్రధానమైనవి. గౌతమీ నదిపై పెద్ద వంతెన నిర్మాణానికి 2017 నవంబర్ 8న టెండర్లు వేయగా 2018 మే 25న వైనతీయ వశిష్ట సంస్థ టెండర్ దక్కించుకుంది. ప్రస్తుతం భూసేకరణ జరుగుతోంది. మొత్తం 9080 ఎకరాలు కావాల్సి ఉండగా తూ.గోదావరిలో 791, ప.గోదావరి జిల్లాలో 276 ఎకరాల భూమిని ఇప్పటికే ప్రభుత్వం రైల్వే శాఖకు ఇచ్చింది. ఈ రైలుమార్గం గౌతమీ, వైనతీయం, వశిష్ట నదుల మీదుగా సాగుతుంది. అమలాపురం నుంచి కొబ్బరి, వరి, చేప ఉత్పత్తులు భారీగా చెన్నై, లేదా కోల్‌కతాకు, ఉత్తర భారత ప్రాంతాలకు ఎగుమతి చేసే సదుపాయం లభిస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది రాజోలుకు దగ్గరలోనే ఉండటం వల్ల దీని ప్రాధాన్యత కూడా మరింతగా పెరగనుంది.