రాష్ట్రీయం

టీడీపీ వైపు రాధా చూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణలు, పార్టీ ఫిరాయింపులు అత్యంత వేగవంతంగా మారుతున్నాయి. ఈనేపథ్యంలోనే కాపు సామాజిక వర్గానికి చెందిన వైకాపా సీనియన్ నేత, మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ పార్టీకి రాజీనామా చేయటంతో ఇక ఆయన ఏ పార్టీ వైపు పయనిస్తారోనన్న తీవ్ర ఉత్కంఠ రంగా వర్గంలో నెలకొంది. ఊహాగానాలు అంతులేని విధంగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో వైకాపా తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాధా టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌రావు చేతిలో 16వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో 1985లో తన తండ్రి రంగా, ఆపై తల్లి రత్నకుమారి ప్రాతినిధ్యం వహించిన సెంట్రల్ నియోజకవర్గంపై దృష్టి సారించారు. తొలుత ఈ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగానూ నియమితులయ్యారు. అయితే కొద్దిరోజులకే రంగా శిష్యుడైన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కాంగ్రెస్ నుంచి వైకాపాలో చేరటంతో వర్గ రాజకీయాలు మొదలయ్యాయి. రాధాలో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. జగన్ మొదటి నుంచి రాధాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే వచ్చారు. రాధా ఫిర్యాదుపై తన బంధువైన ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ పీ గౌతంరెడ్డిని సస్పెండ్ చేశారు. అయినా రాధా అసంతృప్తితో పార్టీకి దూరమవుతూ వచ్చారు. ఓ దశలో మచిలీపట్నం ఎంపీ సీటు ఆశ చూపినా ససేమిరా వద్దన్నారు. రాజీనామా చేయబోతున్నారని తెలిసి జగన్ దూతగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆదివారం ఉదయం రెండు గంటలకు పైగా ఏకాంతంగా సమావేశమై రాధాను బుజ్జగించారు. అయినా ఫలితం దక్కలేదు. రాధా తన రాజీనామా లేఖను నేరుగా జగన్‌కు పంపించారు. దీంతో ఇక ఆయన ఏ పార్టీలో చేరతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు కొంతకాలంగా రాధాతో సంప్రదింపులు సాగిస్తున్నారనే ప్రచారం ఎటూ ఉంది. జనసేన వల్ల దూరమవుతున్న కాపు వర్గాన్ని ఆకర్షించటానికి రాధాను ఆయుధంగా వాడుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. అయితే టీడీపీలో రంగా వర్గం ఇమడలేదన్న వాదన కూడా లేకపోలేదు. 1994లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన తల్లి రత్నకుమారి టీడీపీలో చేరారు. అయితే ఎక్కువ కాలం ఆ పార్టీలో ఇమడలేక తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ప్రస్తుతం క్రీయాశీలక రాజకీయాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. ఈనేపథ్యంలో మరికొందరు రాధాను జనసేన పార్టీలోకి రావాల్సిందిగా తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు.