రాష్ట్రీయం

తొలి విడత పోలింగ్ నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి తొలివిడత పోలింగ్ సోమవారం జరుగుతోంది. మొత్తం 4,479 పంచాయతీల ఎన్నికలకోసం రిటర్నింగ్ అధికారులు ఈ నెల 7న నోటీస్ జారీచేశారు. నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, ప్రచారం తర్వాత సోమవారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే 4,479 పంచాయతీల్లో 769 సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో తొమ్మిది సర్పంచ్ స్థానాలకు కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల ఎన్నికలు జరగడం లేదు. ఎన్నికలు జరుగుతున్న 3,701 గ్రామ పంచాయతీలకు 12,202 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా 39,822 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత 10,654 వార్డుస్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. 192 వార్డు సభ్యుల స్థానాలకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగడం లేదు. సోమవారం పోలింగ్ జరిగే 28,976 వార్డు సభ్యుల స్థానాలకు 70,094 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. పోలింగ్ సోమవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుంది. పోలింగ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. విజయం సాధించిన సర్పంచ్, వార్డు సభ్యులను సమావేశపరుస్తారు. వీరు ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు. పోలింగ్‌కోసం 1,48,033 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్టు
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దాదాపు 26 వేల మంది పోలీసులు బందోబస్తు డ్యూటీలో ఉంటారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరారు. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులను తీసుకుని వెళ్లిన సిబ్బందికి పోలీసు అధికారులు పూర్తి రక్షణ ఏర్పాటు చేశారు.