రాష్ట్రీయం

నమ్మకాన్ని నిలబెడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ‘ఏది చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి, కసరత్తు చేశాకే పకడ్బందిగా అమలు చేయడం మా విధానం. గుడ్డిగా చీకట్లోకి బాణం వదిలే అలవాటు ఎప్పుడూ లేదు’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ‘ఎన్నికల్లో మా కంటే ఎక్కువగా 2 లక్షల రుణ మాఫీ చేస్తామని మీరు చెప్పినా లక్ష రూపాయలు మాత్రమే చేస్తామన్నా ప్రజలు మమ్మల్నే నమ్మి అఖండ విజయం చేకూర్చారు’ అని కాంగ్రెస్‌ను ఉద్దేశించి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చేసిన విమర్శలకు సీఎం కేసీఆర్ ధీటుగా సమాధానం చెప్పారు. సీఎం మాట్లాడుతూ, పింఛన్ల పెంపు, నిరుద్యోగులకు భృతి తదితర హామీలన్నింటినీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి రంధి అవసరం లేదన్నారు. వందకు వంద శాతం ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకుంటామన్నారు. వచ్చే మూడేళ్లలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వబోతున్నామని ఆయన తెలిపారు. వీటి నిర్మాణం కోసం ఇప్పటికే రూ.99 వేల కోట్లు ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు. మార్చి నాటికి మరో రూ. 7 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడానికి మరో లక్షా 20 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నామని, ఇప్పటికే లక్షా ఏడు కోట్లు ఖర్చు చేశామని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా రెండు లక్షల 25 వేల ఖర్చు చేసి కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ద్వారా ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం కేసీఆర్ వివరించారు. తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత నీటిపారుదల, వ్యవసాయమన్నారు. రైతు రాష్ట్రంగా, రైతు ప్రభుత్వంగా తాము తెచ్చుకున్న పేరు నిలబెట్టుకుంటామన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు కూడా వేర్వేరు చోట్ల వేగంగా జరుగుతున్నాయన్నారు. ఆదరా బాదరగా
వీటిని పూర్తి చేయాలని అనుకోవడం లేదని ఆయన చెప్పారు. వీటికి కొంత సమయం పడుతుందని ఎన్నికల సభల్లోనే ప్రజలకు చెప్పానని కేసీఆర్ గుర్తుచేశారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ హయాంలో చేపట్టిన గృహ నిర్మాణ పథకాల లెక్కలు చూస్తే ఇక రాష్ట్రంలో ఎవరికి ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కాగితాల మీదనే తప్ప క్షేత్రస్థాయిలో అవీ లేవన్నారు. ఒక మంథని నియోజకవర్గంలోనే ఇళ్లు అవసరమున్న వారి కంటే 140 శాతం ఎక్కువగా ఇళ్లు ఇచ్చినట్టు రికార్డుల్లో ఉందన్నారు. తమ ప్రభుత్వంలో ఇలాంటి కుంభకోణాలకు, లంభకోణాలకు తావు లేదన్నారు. లబ్దిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరిగేందుకు అధికారులకే ఆ పని అప్పజెప్పామన్నారు. అందరూ ఇళ్లు లేని వారే కావడంతో పూర్తి అయిన ఇళ్లను లాటరీ పద్ధతిలో కేటాయిస్తామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో చేపట్టిన ఇళ్ల కోసం లబ్ధిదారుల నుంచి కూడా వాటా వసూలు చేశారన్నారు. కానీ తమ ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో ఈ పథకాన్ని చేపట్టిందన్నారు. గతంలో ఈ పథకం కింద లబ్ధిదారులు చెల్లించాల్సిన రూ. 4 వేల కోట్ల బకాయిలను కూడా తమ ప్రభుత్వం రద్దు చేసిందని సీఎం గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా సొంత స్థలంలో నిర్మించుకోవడానికి ముందుకొచ్చే వారికి కూడా ఐదు నుంచి ఆరు లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. రాష్టవ్య్రాప్తంగా వాస్తవానికి ఎంత మందికి ఇళ్లు అవసరమో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లను భాగస్వామ్యులను చేసి సర్వే జరిపిస్తామని సీఎం వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం మిషన్ భగీరథ పథకం పూర్తి చేశామన్నారు. వచ్చే నలబై ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రణాళక ప్రకారం 23 వేల 968 ఆవాసాలకు, 142 మున్సిపాల్టీలకు మంచినీటిని అందించే పథకం పూర్తి అయిందన్నారు. 23 వేల గ్రామాలకు మంచినీరు చేరినా ఇంకా ఇంటింటికి నల్లాలు బిగించే కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇప్పటికే 18 వేల గ్రామాల్లో ఈ కార్యక్రమం పూర్తి అయిందన్నారు. మార్చి 31 నాటికి వందకు వంద శాతం ఇంటింటికి నీళ్లు ఇచ్చి తీరుతామని చంద్రశేఖరరావు వెల్లడించారు.