రాష్ట్రీయం

కేసీఆర్ యాగానికి సిద్ధమైన ఎర్రవెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 20 : సిద్దిపేట జిల్లా ఎర్రవెళ్లి వ్యవసాయ క్షేత్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరో యాగం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల ముందే రాజశ్యామల యాగాన్ని నిర్వహించిన కేసీఆర్ భారీ విజయంతో సాధించి మళ్లీ ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని అధిరోహించారు. లోక కల్యాణార్థం, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో ఉండాలని ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవెళ్లి తన వ్యవసాయ క్షేత్రంలో ఈనెల 21న సోమవారం నుండి ఐదురోజుల పాటు చతుర్వేద పురసుర మహారుద్ర సహిత సహాస్త్ర చండీయాగం నిర్వహించనున్నారు.
ఇందుకోసం నిర్వహకులు యాగ శాలతోపాటు, హోమ గుండాలను సిద్ధం చేయటంతో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. ఈనెల 21 నుండి 25 వరకు ఐదు రోజుల పాటు చతుర్వేద పురసుర మహారుద్ర సహిత సహాస్త్ర చండీయాగం గత కొన్ని రోజులుగా పనులు ముమ్మరంగా చేపట్టారు. ఇప్పటికే రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే యాగానికి సంబంధించిన పనులను రెండు పర్యాయాలు పరిశీలించారు. రాజశ్యామల యాగం, బగళ ముఖి యాగం సైతం ఇందులో భాగంగా నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో రెండు వందల మంది రుత్వికులు పాల్గొని నిర్వహించనున్నట్లు సమాచారం. ఐదురోజుల పాటే సాగే యాగంలో ప్రతి రోజు పారాయణలు నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా పది హోమ గుండాలను ఏర్పాటు చేశారు. ఒక్కో హోమ గుండం వద్ద పది మంది రుత్వీకులు హోమం నిర్వహిస్తారు.
ప్రతి రోజు ఉదయం 7 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 7-30 గంటల వరకు వేద పారాయణలు నిర్వహించనున్నారు. ఈ యాగం నిర్వహించేవారు దీక్ష ధారణ, తర్వత ఏకభుక్తం చేయాల్సి ఉంటుందని, యజ్ఞశాల ఉన్న శివారు దాట కూడదనే నిబంధనలు కఠినతరంగా ఉంటాయంటున్నారు. రుత్వికులు త్రికాల సంధ్యవందనం చేస్తారని, దీక్షలోనే కొనసాగుతారు. జపతపాల ద్వరా తన శక్తిని ధార పోస్తారు. ఆహార నియమాలు కఠినతరంగా పాటిస్తారు. శృంగేరి పీఠాధిపతి భారతి తీర్థస్వామి, విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆశీస్సులతో వేద పండితులు శశాంకశర్మ, గోపికృష్ణ ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహించనున్నారు. గతంలో సీఎం కేసీఆర్ ఎర్రవెళ్లి వ్యవసాయ క్షేత్రంలో పెద్దఎత్తున అయుత చండీయాగం పదిరోజుల పాటు నిర్వహించగా, ఈయాగానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ప్రజలు, ప్రజలతో వివిధ ప్రముఖులు కూడ యాగంలో పాల్గొన్నారు. కాగా ఈ యాగానికి మాత్రం కేవలం రాజకీయ ప్రముఖులు, సీఎం కేసీఆర్ బంధువులు, శ్రేయోషిలాషులు మాత్రమే హాజరుకానున్నుట్ల తెలుస్తుంది. సందర్శకులను అనుమతించే విషయం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఈ యాగం నిర్వహణకు యజ్ఞగుండాలతో పాటు, 10 హోమ గుండాలను అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు సమాచారం. చివరిరోజు అగ్నిస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఎర్రవెళ్లి ఫామ్‌హౌజ్‌లో సీఎం కేసీఆర్ యాగాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం 150కు పైగా పోలీసు సిబ్బందిని బందోబస్తులో వినియోగిస్తున్నట్లు తెలుస్తుంది. సీపీ జోయల్ డేవిస్, అడీషనల్ డీసీపీ నర్సింహరెడ్డి ఎర్రవెళ్లి వద్ద ఫౌమ్‌హౌజ్ వద్ద బందోబస్తును పర్యవేక్షించటంమే గాకుండ పరిససరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. యాగం పూర్తయ్యే వరకు పోలీసు నిఘా కొనసాగనుంది.
ఏర్పాట్లను పరిశీలించిన సీఎం కేసీఆర్
ఎర్రవెళ్లి వ్యవసాయ క్షేత్రంలో ఈనెల 21 నుండి ఐదు రోజులపాటు జరిగే చతుర్వేద పురసుర మహారుద్రం సహిత చండీయాగం ఏర్పాట్లను ఆదివారం సీఎం కేసీఆర్ పరిశీలించారు. చతుర్వేద పురసుర మహారుద్ర సహిత చండీయాగం సందర్భంగా నిర్మించిన యాగశాలలు, హోమగుండాలను పరిశీలించారు. యాగం నిర్వహణ ఏర్పాట్లపై రుత్వికులతో చర్చించారు. యాగ నిర్వాహకులు వేద పండితులు శశాంకశర్మ, గొపికృష్ణలతో సీఎం కేసీఆర్ చర్చించారు. ఈకార్యక్రమంలో ఎంపి సంతోష్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ జహింగీర్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రాలు.. సిద్దిపేట జిల్లా ఎర్రవెళ్లిలో ఏర్పాటు చేసిన యాగశాలలు
* యాగానికి సంబంధించి ఏర్పాట్లను ఆదివారం పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు.