రాష్ట్రీయం

ఎగసిపడిన ‘భగీరథ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, జనవరి 20: మిషన్ భగీరథ ద్వారా హైదరాబాద్‌కు తాగునీటిని అందిస్తున్న పైపులు పగిలిపోవడంతో నీరంతా కూడా వృథాగా పారుతున్న ఘటన ఆదివారం సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం మేడిపూర్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. జిల్లాలోని కొల్లాపూర్ మండలం నార్లాపూర్ నుంచి కృష్ణాజలాలను తరలించేందుకు మిషన్ భగీరథ ద్వారా రెండేళ్ల క్రితం వేయడం జరిగింది. ఈ పైప్‌లైన్ నుంచి సజావుగా నీటి సరఫరా కొనసాగుతున్నప్పటికి, మేడీపూర్ సమీపంలో ఉన్న పైప్‌లైన్ నుంచి గత కొన్ని రోజుల నుంచి నీరు లీకవుతున్నా అధికారులు ఎవ్వరు పట్టించుకోలేదని సమీప గ్రామాల ప్రజలు, రైతులు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి లీకేజీ ఎక్కువై సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పైపులు పగిలి నీరంతా కూడా పైకి ఎగిసిపడ్డాయని పలువురు రైతులు తెలిపారు. వాటర్ ఫౌంటీన్ మాదిరిగా పైపులనుంచి నీరు పైకి ఎగిసి పడుతున్న దృశ్యం చూపరులకు ఎంతో ఆకట్టుకున్నది. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి మధ్య నడిచే వాహనాలలోని వారితోపాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ప్రజలు భారీ సంఖ్యలో ఈ దృశ్యాన్ని చూసేందుకు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా మంది ఈ దృశ్యాన్ని సెల్పీగా తీసుకోవడం కనిపించింది. ఇది ఇలా ఉండగా సాయంత్రం వరకు నీరంతా కూడా వృద్దాగానే పారుతుండటం జరిగింది. పైపులు పగిలిన విషయాన్ని గ్రామస్తులు మండల తహశీల్దార్‌కు సమాచారం ఇవ్వగా వెంటనే పోలీసులకు తెలపడంతో పోలీసులు అక్కడికి చేరుకొని గుమికూడిన ప్రజలను పక్కకు పంపించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. పైపులు పగిలిన విషయాన్ని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులకు తెలపడంతో మిషన్ భగీరథ ద్వారా కల్వకుర్తి మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే నీటి పంపింగ్‌ను ఆపయడంతో రాత్రి ఏడుగంటల ప్రాంతంలో నీరు పారడం ఆగిపోయింది. ఇది ఇలా ఉండగా మిషన్ భగీరథ పథకం కింద వేసిన పైపులు నాసిరకంగా ఉండటం వల్లనే ఈ ఘటన జరిగిందని ఆయా ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. 10్ఫట్ల వ్యాసంతో ఉన్న ఈ పైపుల ద్వారా హైదరాబాద్‌కు పంపింగ్ చేయడం జరుగుతుందని, ఇట్టి పైప్‌లైన్ నిర్మాణం విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని, మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మిషన్ భగీరథ పైపులు పగిలిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చిత్రం.. హైదరాబాద్‌కు వెళ్లే మిషన్ భగీరథ పైపులు పగలడంతో ఎగిసిపడుతున్న కృష్ణాజలాలు