రాష్ట్రీయం

హరీష్ - కేటీఆర్ ఏం మాట్లాడుకున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్, అల్లుడు టి. హరీష్‌రావు అసెంబ్లీ హాలులో దాదాపు 45 నిమిషాలపాటు ‘చిట్-చాట్’ వేయడం ఒకవైపు అధికార పక్షం సభ్యులను, మరోవైపు విపక్ష సభ్యులను విశేషంగా ఆకర్షించింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానాన్ని ఆదివారం శాసనసభలో టీఆర్‌ఎస్ సభ్యుడు కొప్పుల ఈశ్వర్ ప్రతిపాదించగా, టీఆర్‌ఎస్‌కే చెందిన మరోసభ్యుడు వేముల ప్రశాంతరెడ్డి బలపరిచారు. ఈ సందర్భంగా సభ్యులు ఒకవైపు ప్రసంగిస్తుండగా, హరీష్‌రావు కూచున్న కుర్చీకి కుడిపక్కనే ఈటల కూచునే కుర్చీలో కేటీఆర్ కూచున్నారు. 10.30కు సభ్యుల ప్రసంగం కొనసాగుతుండగా, హరీష్‌రావు-కేటీఆర్ 10.45 నుండి 11.30 వరకు మాట్లాడుకుంటూనే కనిపించారు. ఏ అంశాలపై చర్చించారోకానీ చర్చ మాత్రం సీరియస్‌గానే కొనసాగింది. వీరు ఇలా మాట్లాడుతుండగా ఈటల వచ్చారు. దాంతో సంభాషణ ఆపి కేటీఆర్ లేవబోయారు. ఈటల ఆయన్ని వారిస్తూ ‘మీరు మాట్లాడుకోండి, నేను పక్కనే కూచుంటా’నని హరీష్‌కు ఎడమవైపున కూర్చున్నారు. తర్వాత బావా- బామ్మర్దుల సంభాషణ మరో 15 నిమిషాలు కొనసాగాయి.

కేటీఆర్, టి.హరీష్‌రావు (ఫైల్‌ఫొటో)