రాష్ట్రీయం

హద్దు మీరితే మైక్ కట్: పోచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: అసెంబ్లీ సమావేశాల్లో ఎవరైనా గాడి తప్పి మాట్లాడితే వెంటనే మైక్ కట్ చేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు సభా సంప్రదాయాలు, ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ వంటి అసెంబ్లీ కార్యక్రమాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడిన అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసన మండలి కార్యదర్శి వీ. నరసింహాచార్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పాలనలో, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో, అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శవంతంగా నిలిచినట్లు అసెంబ్లీని కూడా ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. సభలో అడ్డగోలు విమర్శలు చేసుకుంటూ విలువైన సమయాన్ని వృధా చేసుకోరాదని ఆయన సూచించారు. సభలో ప్రతి నిమిషం విలువైందని, ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలని అన్నారు. కొత్త ఎమ్మెల్యేలు ఆవేశంలో లేదా తెలియకనో మాట దొర్లినా దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరాదని ఆయన కోరారు. అసెంబ్లీ పని దినాలను అవసరాన్ని బట్టి పొడిగిస్తామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. పార్టీ ఫిరాయింపులపై వస్తున్న విమర్శల గురించి ప్రశ్నించగా, బలవంతంగా ఎవరిని చేర్చుకున్నా తప్పేనని ఆయన తెలిపారు. అయితే స్వచ్చంధంగా పార్టీ మారినా, దానిపై పిటీషన్లు దాఖలైతే చట్ట ప్రకారం తాము నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ పోచారం చెప్పారు. మంత్రి పదవి, స్పీకర్ పదవి బాధ్యత నిర్వహణలో ఏదీ కష్టంగా ఉంటుందని ప్రశ్నించగా, నియమ, నిబంధనల ప్రకారం నడుచుకునే వారికి ఏ పదవినైనా విజయవంతంగా నిర్వహించగలరని ఆయన తెలిపారు.

చిత్రం.. మీడియాతో మాట్లాడుతున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి