రాష్ట్రీయం

విదేశీ విహంగాల రాకతో సూళ్లూరుపేటకు గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జనవరి 20: విదేశీ విహంగాల రాకతో సూళ్లూరుపేట దేశానికే తలమానికంగా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మూడు రోజులపాటు జరిగే పక్షుల పండుగ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా మంత్రి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఫ్లెమింగో బెలూన్ ఎగురవేసి పండుగను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ స్టాల్స్‌ను ప్రారంభించి వాటిని తిలకించారు. అనంతరం ఫెస్టివల్ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి పరసా వెంకటరత్నయ్య అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ సభలో సోమిరెడ్డి మాట్లాడారు. ఎక్కడో విదేశాల నుంచి ఖండాతరాలు దాటుకొని ఈ ప్రాంతానికి విదేశీ విహంగాలు రావడం తలచుకొంటేనే ఆశ్చర్యకరమని, మళ్లీ ఆ పక్షులు ఇక్కడే ఆరుమాసాల పాటు విడిది చేసి గుడ్లు పెట్టి పొదిగి మళ్లీ రెక్కలు వచ్చాక వెళ్లడం అశ్చకరమైన విషయమన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన షార్ కేంద్రం ఇక్కడ ఉండడం ఒకవంతైతే.. ఇక్కడున్న పులికాట్, నేలపట్టులకు పక్షులు రావడం వాటి పేరుతో ఇలాంటి పండుగలు చేయడం వల్ల సూళ్లూరుపేటకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావడం సంతోషమన్నారు. రాష్ట్రంలో పండుగల పరంపర జరుగుతోందని ఆయన అభివర్ణించారు. మొన్న రాష్ట్రంలో సంక్రాంతి పండుగను అందరూ సంతోషాలతో జరుపుకొన్నారని, నేడు సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్‌ను జరుపుకొంటున్నారని, ఫిబ్రవరిలో రాష్ట్రంలో పేదలకు నిజమైన పండగ జరుపుకోబోతున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకొన్న మంచి నిర్ణయంతో ఎన్టీఆర్ భరోసా ఫించన్ల రెట్టింపుతో పేద కుటుంబాల్లో నిజమైన పండగ వాతావరణం నెలకొందన్నారు. వచ్చే నెలలో ఫించన్లు పంపిణీ చేసేటప్పుడు రాష్ట్రంలో ప్రతి ఇంటా సంక్రాంతి పండుగకన్నా సంతోషంగా పింఛన్ల పండుగ చేసుకోబోతున్నారని తెలిపారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా పేదల జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై 7 వేల కోట్ల భారం పడుతుందన్నారు. పేదల కోసం చంద్రబాబు ఇంకా అనేక నిర్ణయాలు తీసుకొన్నారని ఇందులో వ్యవసాయానికి 7 గంటల కరెంట్ 9 గంటలకు పెంచడం, ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా పేదల ఆరోగ్యానికి సేవా పరిమితిని రూ.2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అన్ని రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలకు కొంతమందికి నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు.
ఫిబ్రవరిలో రైతుల ఖాతాలోకి మాఫీ సొమ్ము
రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రుణ విముక్తి పథకం కింద ఫిబ్రవరిలో రెండు విడతలకు సంబంధించిన రుణమాపీ సొమ్మును రైతుల ఖాతాలోకి నేరుగా జమ చేస్తామని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 8వేల కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిటీ కింద రూ.2,100 కోట్లు ఇచ్చామన్నారు. ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలు తగ్గించి ఆదుకొన్నామని దీంతో ఆక్వా సాగుచేసే వారికి కూడా ఎంతో లాభం చేకూరిందన్నారు. ఈ పథకాల్లో అధికశాతం మంది వైకాపా వారే లబ్ధి పొంది ఉన్నారని అయినా విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. వర్షాకాలంలో సుమారు 2500 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతుందనే ఉద్దేశంతో దేశంలో నదుల అనుసంధానం చేసిన ఘనత కూడా చంద్రబాబుదేనన్నారు. ఈ నదుల అనుసంధానంలో భాగంగా 8 మాసాల్లో పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి 100 టీఎంసీల నీటిని కృష్ణ డెల్టాకు అందించామన్నారు. త్వరలో గోదావరి-పెన్నా నదుల అనుసంధానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.
చిత్రాలు.. ఖండాంతరాలు దాటి తరలి వచ్చిన విదేశీ పక్షులు
*జ్యోతి ప్రజ్వలనతో పక్షుల పండుగను ప్రారంభిస్తున్న మంత్రి సోమిరెడ్డి