రాష్ట్రీయం

యువశక్తిలో మహిళాశక్తి ఓ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: యువ శక్తిలో మహిళా శక్తి అనేది కూడా ఓ భాగం అని ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. వసుదైక కుటుంబం అనేది మన మార్గం అని ఆయన తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత అధ్వర్యంలో రెండు రోజుల పాటు ఏర్పాటైన అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తూ జాగృతి అధ్యక్షురాలు కవితను అభినందించారు. జాగృతి అంటేనే చైతన్యం అని, ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకు కవిత చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని అన్నారు. యువత అంటే అందులో మహిళలు కూడా భాగమని అన్నారు. గాంధీ మార్గం మనకు ఆదర్శమని, ప్రతి ఒక్కరూ అహింసా మార్గాన్ని అనుసరించాలని ఆయన సూచించారు. మనుషుల మధ్య అంతరాలు తొలగాలని, అందరికీ సమాన అవకాశాలు రావాలని, అప్పుడే సమాజం సరైన మార్గంలో పయనిస్తుందని గవర్నర్ నరసింహన్ తెలిపారు.
జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత ప్రసంగిస్తూ తెలంగాణ రక్తంలోనే విశ్వమానవాళి గురించి ఆలోచించేతత్వం ఉందని అన్నారు. ఇన్ని రోజులు మన తెలంగాణ గురించి ఆలోచించామని ఆమె చెప్పారు. ఈ అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు ద్వారా ప్రపంచం ముందున్న ప్రధాన సవాళ్ళు వాటికి పరిష్కార మార్గాలు గుర్తించే మంచి ప్రయత్నం జరిగిందని ఆమె తెలిపారు. గాంధీ చూపిన మార్గంలో సుస్థిర అభివృద్ధి సాధించేందుకు యువత ముఖ్య భూమిక పోషించాలని ఆమె పిలుపునిచ్చారు. సుమారు 110 దేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన మేధావులు, ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకుని వచ్చేందుకు తాము ఏడాది కాలంగా ప్రయత్నించామని ఆమె తెలిపారు. ఈ సదస్సులో ఎన్నో అర్థవంతమైన చర్చలు జరిగాయని, ఎన్నో పరిష్కార మార్గాలు కనుగొనే ప్రయత్నం జరిగిందని ఆమె వివరించారు. పర్యావరణం, యువత, మహిళా సాధికారత తదితర అంశాలపై దేశ, విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ అభిప్రాయాలను చెప్పారని ఆమె తెలిపారు. ప్రతి దేశంలో ప్రభుత్వ విధానాల రూపకల్పనలో యువత భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. ముగింపు సమావేశానికి గవర్నర్ దంపతులు, ఇంకా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ పాల్గొన్నారు.
చిత్రం..యువ నాయకత్వ సదస్సులో పాల్గొన్న ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఎంపీ కవిత