రాష్ట్రీయం

‘పవర్ పాయింట్’పై ఎవరేమన్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ్యమంత్రి కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరుకాకుండా సెల్ఫ్‌గోల్ చేసుకున్నారు. అసెంబ్లీలో లాప్‌టాప్స్ వంటి ఆధునిక పరికరాలను వాడుతున్నప్పుడు ‘తెర’ పెడితే తప్పేమిటీ?
-మంత్రి హరీశ్‌రావు

‘క్లాస్’ రూమ్‌లాగా అనిపించింది
ముఖ్యమంత్రి కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌తో మాకు ‘క్లాస్’ రూమ్‌లో కూర్చున్నట్లు అనిపించింది. జలవిధానంపై ముఖ్యమంత్రి చాలా వివరణాత్మకంగా ప్రసంగించారు.
- పాయం వెంకటేశ్వర్లు, వైకాపా ఎమ్మెల్యే

చాలా అద్భుతం
ముఖ్యమంత్రి కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ చాలా అద్భుతంగా ఉంది. సాగు నీటి ప్రాజెక్టులను త్వరితగతంగా పూర్తి చేసేందుకు కెసిఆర్ చేస్తున్న ప్రయత్నానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది.
- బలాలా, మజ్లిస్ ఎమ్మెల్యే

రంగుల కల
అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్ రంగుల కల చూపించారు. ఐదేళ్ళలో కొత్త ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. ఐదేళ్ళు కాదు కదా 15 ఏళ్ళు అయినా అవి పూర్తి కావు.
- చిన్నారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే

చరిత్ర సృష్టించారు
ముఖ్యమంత్రి కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను మూడు గంటల పాటు ఇచ్చి చరిత్ర సృష్టించారు. కెసిఆర్ సిఎం కావడం తెలంగాణ ప్రజల అదృష్టం. సభకు హాజరుకాని విపక్షాల ఎమ్మెల్యేలు బయట చాటుగా చూశారు.
- బాబూ మోహన్, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే