రాష్ట్రీయం

మోసపూరిత ప్రచారాల్లో బాబు దిట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 20: మోసపూరిత ప్రచారాలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిట్ట అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఆదివారం గుంటూరులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో పెద్దనోట్లు రద్దుచేయాలని తానే లేఖ రాశానని చెప్పిన చంద్రబాబు తర్వాత డీమానిటైజేషన్ కమిటీకి కన్వీనర్ అయ్యారన్న విషయం మరచినట్లున్నారన్నారు. కేంద్రం ఏ రాష్ట్రానికీ ఇవ్వని నిధులను ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిందన్నారు. ప్రతి రాష్ట్రానికి 4లక్షల ఇళ్లు కేటాయిస్తే ఏపీకి 7.45 లక్షల ఇళ్లు కేటాయించిందన్నారు. రాష్ట్భ్రావృద్ధికి ప్రధాని మోదీ తన వంతు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో నేషనల్ హైవేల నిర్మాణానికి ఐదేళ్లలో లక్ష కోట్లను కేంద్రం ఇచ్చిందన్నారు. రోడ్ల నిర్మాణం ప్రాజెక్టులో భాగంగా పూరె్తైన వాటిని ఈ నెల 21న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆకివీడులో ప్రారంభిస్తారన్నారు. 2014 ముందు వరకు రాష్ట్రంలో 4,193 కిలోమీటర్ల రోడ్లను పూర్తిచేస్తే ఈ ఐదేళ్ల కాలంలో 7,246 కిలోమీటర్లు నిర్మాణం లక్ష్యంకాగా ఇప్పటివరకు 3,150 కిలోమీటర్లు పూర్తి చేశామన్నారు.
గడ్కరీ శాఖకు సంబంధించే రాష్ట్రానికి 3లక్షల కోట్ల నిధులు ఇచ్చారని, ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చాక గ్రామీణాభివృద్ధికి 24వేల కోట్లు ఇచ్చామన్నారు. కేంద్రం నిధులతో జరుగుతున్న ప్రతి పనిలో చంద్రబాబు ముడుపులు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ట్రిపుల్ తలాక్, ఓబీసీ కమిషన్‌కు చట్టబద్ధత, ఈబీసీలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించడం దేశంలో మరే ప్రధానీ చేయలేదని కన్నా స్పష్టం చేశారు. విలేఖరుల సమావేశంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తురగా నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ. పక్కన జీవీఎల్ నరసింహారావు