రాష్ట్రీయం

ఉంటే ఉండండి.. పోతే పొండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, జనవరి 20 :‘‘టీడీపీలో ఉండాలనుకుంటే ఉండండి.. పోవాలనుకుంటే పోండి.. అంతేకాని ఈ బూటకాలెందుకు..’’ అని మంత్రి ఆదినారాయణరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డికి అల్టిమేటం జారీ చేశారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదివారం వారు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మేడా తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమావేశంలో కొందరి చేత అల్లర్లు చేయించినంత మాత్రాన ఇక్కడ ఎవరూ భయపడేవారు లేరన్నారు. పార్టీ మారాలనుకుంటే హుందాగా బయటకు వెళ్లిపోవాలి తప్ప సమావేశాల్లో అల్లర్లు సృష్టించేలా ప్రయత్నించకూడదన్నారు. గత ఆరేడు నెలలుగా మేడా వ్యవహారశైలితో పాటు పార్టీ మారతారంటూ ఆరోపణలు వస్తున్నాయన్నారు. దీనిపై పార్టీ అధిష్ఠానం, తాము, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఈ ఆరోపణలకు తెరదించేలా గట్టిగా ఖండించాలని పలుమార్లు మేడాను కోరినా ఫలితం లేదన్నారు. ఈ నెల 17వ తేదీ మేడాను స్వయంగా తీసుకురమ్మని సీఎం చంద్రబాబు తమను కోరారని, అలాగే పార్టీ అధిష్ఠానంలో సన్నిహితంగా ఉండే ఓ నేత కూడా మేడాకు ఫోన్ చేసి రమ్మని చెప్పారన్నారు. ఈ మేరకు అతడు వెళ్లేందుకు విమానం టికెట్ కూడా బుక్ అయిందని, అయితే మేడా తొలుత వస్తానని చెప్పి ఆ తర్వాత పని ఉంది రాలేనని చెప్పడం దేనికి సంకేతమని వారు ప్రశ్నించారు. మీడియా సమావేశం ఉన్న విషయంపై కూడా మేడాకి తెలిపామని, అయినా ఆయన తనకు ఆహ్వానం లేదంటూ బుకాయించడం శోచనీయమన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆ తర్వాత కడపకు వెళ్లి అక్కడ ఇతర పార్టీల నేతలతో మంతనాలు జరపడం లాంటి చర్యలు పార్టీ వ్యతిరేక చర్యల కిందకు రావా? అని ప్రశ్నించారు. మేడా తండ్రి మేడా రామక్రిష్ణారెడ్డికి టీడీపీ తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా అవకాశం కల్పించడంతో పాటు మొదటిసారి గెలిచినప్పటికీ మేడాకి విప్ పదవి కట్టబెట్టి ప్రాధాన్యత కల్పించిందన్నారు. నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా గతంలో కంటే తక్కువగా చేశారన్నారు. ఈ పరిస్థితిలో మేడాను ఎలా నమ్మాలని, అందుకే పార్టీ తరఫున వివరణ ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటుచేశామన్నారు. కాగా నెల 22వ తేదీ అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో జరగనున్న రాజంపేట నియోజకవర్గ స్థాయి సమావేశానికి పార్టీ కుటుంబ సభ్యులంతా హాజరవ్వచ్చన్నారు.
చిత్రం..ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మాట్లాడుతున్న మంత్రి ఆదినారాయణరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి