రాష్ట్రీయం

ఈసారైనా తీరు మార్చుకోరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: ‘అది చేయలేదు, ఇది చేయలేదంటూ అప్పుడే దుకాణం షురూ జేసిండ్రా?. ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల అయినా కాకుండానే అప్పుడే విమర్శలా? ఈ సారైనా మీ (కాంగ్రెస్) పంథా మార్చుకోరా? అయినా అదే పద్ధతిలో విమర్శలు కొనసాగిస్తామంటే జాలి పడటం తప్ప ఏమి చేయలేను’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్షలు పూర్తి చేసి అద్దాలు మాత్రమే అందజేసాం తప్ప ఆపరేషన్లు చేయలేదన్నారు. విషయం తెలుసుకోకుండానే వరంగల్‌లో కంటి వెలుగు ఆపరేషన్లు వికటించినట్టు కాంగ్రెస్ సభ్యుడు ఆరోపణలు చేయడం తగదని సీఎం కేసీఆర్ హితవు పలికారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో కాంగ్రెస్ సభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి కంటి వెలుగు ఆపరేషన్లు వికటించి కళ్లు పోయాయని చేసిన ఆరోపణలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. కంటి వెలుగు ఆపరేషనే్ల జరగనప్పుడు వికటించే సమస్య ఎక్కడ ఉత్పన్నం అవుతుందని సీఎం ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యుడు చేసిన ఆరోపణలో కించిత్తూ వాస్తవం లేదని సీఎం తప్పుపట్టారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల కూడా కాకముందే అది చేయలేదు, ఇది చేయలేదంటూ పాత పద్ధతిలోనే విమర్శలు చేయడం మంచి పద్థతి కాదన్నారు. రైతులకు పంట రుణాల మాఫీ చేయలేదని విమర్శించే ముందు పంజాబ్, కర్నాటకలో రుణ మాఫీపై ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతు కుటుంబానికి లక్ష రూపాయల పంట రుణాల మాఫీ చేశామన్నారు. ఈ దఫా కూడా అంతే మొత్తంలో రుణ మాఫీ చేస్తామన్నారు. ఒకేసారి రుణ మాఫీ చేస్తామని తామెక్కడా చెప్పలేదని సీఎం గుర్తు చేశారు. రెండో, మూడో విడతల్లో ఇచ్చిన మాట ప్రకారం రుణ మాఫీ చేస్తాం, దీంట్లో ఎవరికి ఎటువంటి అనుమానం అక్కర్లేదన్నారు. తాము వందకు వంద శాతం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామన్న నమ్మకంతోనే ప్రజలు గతంలో 63 సీట్లలో గెలిపిస్తే ఈ దఫా అదనంగా 25 కలిపి 88 సీట్లలో గెలిపించారని సీఎం అన్నారు. సీఎం వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకుడు భట్టి విక్రమార్క స్పందిస్తూ గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలపై ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, సభకు వివరణ ఇవ్వకుండా సీఎం ఇలా దెప్పి పొడిచినట్టు మాట్లాడటం సబబు కాదన్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏడాది రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తే, అవ్వేమి జరగనట్టు సీఎం మాట్లాడటం సమంజసమా? అని భట్టి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ స్పందిస్తూ ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే దెప్పిపొడిచినట్టు భావిస్తే తానేమి చేయలేనన్నారు. గత ప్రభుత్వాలు రైతులను వారి కర్మకు వారిని వదిలేస్తే తమ ప్రభుత్వం వచ్చాకే 15 నుంచి 16 వందల మంది అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ అధికారులను, 150 మంది సర్వేయర్లను నియమించామని సీఎం గుర్తు చేశారు. నిజాం హయాంలో జరిగిన భూ సర్వే తర్వాత తామే పూనుకుని భూ ప్రక్షాళన జరిపించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు భూ రికార్డులను సరి చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికే 94 శాతం భూ సర్వే పూర్తి చేసి 54 లక్షల మంది రైతులకు కొత్త పాసు పుస్తకాలు ఇచ్చామన్నారు. మిగతా వాటిని పంపిణీ చేయడానికి ఎన్నికలు రావడం వల్ల ఇవ్వలేకపోయామన్నారు. భూ రికార్డులను భద్రపర్చడానికి ధరణి వెబ్‌సైట్‌ను ప్రారంభించామని, అలాగే భూ రిజిస్ట్రేషన్ల బాధ్యతలను తాహసీల్‌దార్లకు అప్పగించబోతున్నామన్నారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని పకడ్బందిగా అమలు చేస్తామన్నారు. రోడ్లపై చెత్త వేస్తే రూ. 500 జరిమానా విధించేలా కొత్త చట్టాన్ని రూపొందించామన్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఏ గ్రామంలో కూడా చెత్తా, చెదారం, మురికి కాలువలు కనిపిస్తే ఎన్నికైన ప్రజా ప్రతినిధులను, సంబంధిత ఉద్యోగులను బాధ్యులను చేసే విధంగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తాయో తెలియకుండా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేమన్నారు. అక్కడ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, రాష్ట్రానికి ఏ మేరకు సాయం అందుతుందో తేలిన తర్వాతనే మూడు, నాలుగు నెలలు ఆలస్యంగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతామన్నారు. అప్పటి వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తోనే కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ వివరించారు.