రాష్ట్రీయం

రాజధానిలో అందరికీ ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 21: రాజధానిలో రెండేళ్లకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులు, జ్యుడీషియల్ సిబ్బందికి స్థలాలు, ప్లాట్ల కేటాయింపుపై నూతన విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో అందరికీ గృహవసతి కల్పించేందుకు క్యాపిటల్ హౌసింగ్ ప్రమోషన్ పాలసీని రూపొందించాల్సిందిగా సీఆర్డీఏను ఆదేశించింది. ఆలిండియా సర్వీస్ అధికారులకు 500 చదరపు గజాల చొప్పున స్థలాలు కేటాయిస్తారు. వీటిని సొసైటీలు, గ్రూపుల ద్వారా కేటాయించేందుకు అవసరమైన విధి విధానాలకు రూపకల్పన జరగనుంది. ఈ ప్లాట్లను అభివృద్ధి చేసేందుకు సీఆర్డీఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. సెక్రటేరియట్, లెజిస్లేచర్లలో పనిచేసే గెజెటెడ్, నాన్‌గజెటెడ్ అధికారులు, హైకోర్టులో పనిచేసే సబార్డినేట్ సిబ్బందికి రాజధానిలో హెచ్‌ఓడిలలో పనిచేసే గజిటెడ్ అధికారులకు స్థలాలు కేటాయిస్తారు. అటానమస్ ఆర్గనైజేషన్లలో పనిచేసే వారికి స్థలాలు కానీ, ప్లాట్లను కానీ భూమి లభ్యతను బట్టి మార్కెట్ ధరకు విక్రయిస్తారు. ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు కొత్తగా రెండు హౌసింగ్ పాలసీలను ప్రవేశపెట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. జనరల్ హౌసింగ్ పాలసీ, కేపిటల్ సిటీ హౌసింగ్
ఎంకరేజ్‌మెంట్ పాలసీలు అందుబాటులోకి రానున్నాయి. వీటికి ఫైనాన్స్, లా, సీఆర్డీఏ కార్యదర్శులు ఉమ్మడిగా నిబంధనలు, మార్గదర్శకాలు ఖరారు చేస్తారు. కాగా అమరావతి అక్రిడిటేటెడ్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్‌కు ఎకరం రూ 25 లక్షల చొప్పున 30 ఎకరాలు సీఆర్డీఏ పరిధిలో కేటాయించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందజుకోసం రూ 10 కోట్ల బడ్జెట్‌ను కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. కాగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని 5 చక్కెర కర్మాగారాలకు పన్నులు మినహాయింపు నిచ్చే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనివల్ల ఆయా సంస్థలకు రూ 47.54 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుంది. కోఆపరేటివ్ నిజాం సుగర్స్, ఖండసారి సుగర్ మిల్లులకు సంబంధించి కొనుగోలు పన్ను, వడ్డీలు, పెనాల్టీలకు సంబంధించి రూ 227.04 కోట్ల మొత్తానికి మినహాయింపునిస్తూ మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. కడప జిల్లా కండలేరు రిజర్వాయర్ నుంచి చిత్తూరులోని పుడమటి తాలూకా గ్రామాలకు తాగునీరందించేందుకు రూ 2685 కోట్లతో ప్రతిపాదించిన మంచినీటి పథకానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మచిలీపట్నం డీప్ వాటర్ పోర్ట్, పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి అవసరమైన భూముల కొనుగోలుకు కలెక్టర్ నిర్ణయించిన ధరను మంత్రిమండలి ఆమోదించింది. ఎకరం రూ 40 లక్షల చొప్పున 122.95 ఎకరాల భూమిని ల్యాండ్ పర్చేజ్ స్కీం కింద కొనుగోలు చేస్తారు. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలలో పనిచేసే ఉద్యోగులకు సూపరాన్యుయేషన్ వయసును నిర్ధారించేందుకు చట్టంలో అవసరమైన సవరణలు తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించింది. గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన రైతులకు రాజధానిలో కేటాయించిన ప్లాట్లకు స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు అందించే అంశం మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది.
ఆర్మ్‌డ్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా, హెడ్ కానిస్టేబుళ్లను ఏఎస్‌ఐలుగా పదోన్నతి కల్పిస్తూ మంత్రి మడలి నిర్ణయించింది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన రెండు డీఏలలో ప్రస్తుతం ఒక డీఏను ఈ నెల జీతం నుంచి సర్దుబాటు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. మొత్తం రూ 513.13 కోట్లను వాయిదాల రూపంలో చెల్లించాలని, దీనిపై ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రివైజ్డ్ పే స్కేల్-2015 ప్రకారం మినిమం టైం స్కేల్‌ను ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. బుడగ జంగాల సామాజిక హోదా మార్పుపై శర్మ కమిటీ నివేదికపై మంత్రి మండలి చర్చించింది. వచ్చే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆటోలకు జీవితకాలపు పన్ను, ట్రాక్టర్లకు త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు నిచ్చింది. దీనివల్ల 5.66 లక్షల ఆటోలకు రూ 20 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ట్రాక్టర్లు, ట్రాలీలకు త్రైమాసిక, ఆటోలకు 7 సీటర్ల వరకు మొత్తం 9.79 లక్షల వాహనాలపై ప్రభుత్వానికి రవాణాశాఖకు వచ్చే 66కోట్ల 50లక్షలు నష్టం వాటిల్లినప్పటికీ ఆటో యజమానులు, రైతులకు ఊరట కల్పించాలని ఈ నిర్ణయం తీసుకుంది. లక్షా 82వేల ట్రాక్టర్లకు, లక్షా 22వేల మంది రైతులకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటి వరకు ఉన్న బకాయిలతో కలుపుకుని 66.5 కోట్లు ప్రభుత్వం భరించనుంది. ఇకపై ప్రతి ఏటా రూ 56 కోట్ల మేర రవాణాశాఖ ఆదాయం కోల్పోనుంది. రాష్ట్రంలో పాసింజర్ ఆటోలు 5.66 లక్షలు ఉన్నాయి. వీటిపై ఏడాదికి రూ 20 కోట్ల జీవితకాల, త్రైమాసిక పన్ను వసూలవుతోంది. ఈ పన్ను నుంచి మినహాయింపు నిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. చుక్కల భూముల వివాదానికి సంబంధించి స్పష్టమైన విధానం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నందున ఇకపై సమస్యల పరిష్కార బాధ్యతను కలెక్టర్ల పర్యవేక్షణలో సంబంధింత ఆర్డీవోలకు అప్పగిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. 2014 సంవత్సరంలో ప్రభుత్వ అనుమతిలేకుండా ఇళ్లు నిర్మించుకున్న వారికి ఒక్కో ఇంటికి నిర్మాణానికి రూ 45వేలు, మరుగుదొడ్డికి రూ 15వేలతో కలిపి రూ 60వేలు చెల్లించేందుకు మంత్రి మండలి ఆమోదముద్ర లభించింది. 1996-2004 మధ్య కాలంలో నిర్మించుకున్న పాత ఇళ్ల మరమ్మతులకై ఒక్కో ఇంటికీ రూ 10వేలు ప్రకటించింది. ఇందుకోసం ప్రభుత్వానికి రూ 756 కోట్ల నిధులు అవసరమవుతాయి. లక్షా 26వేల 92 ఇళ్లకు కేటాయింపులు జరపాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వృద్ధులు, వితంతువులకు రూ 2వేలు, విభిన్న ప్రతిభావంతులకు రూ 3500, డయాలసిస్ రోగులకు రూ 2500 పింఛన్లను జనవరి నుంచి చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి నెలలో జనవరి నెలలో తీసుకోవాల్సిన సొమ్మును చెల్లించాలని, వచ్చేనెల 1,2,3 తేదీల్లో పింఛన్ల పండుగ నిర్వహించాలని తీర్మానించింది. రాష్ట్ర వ్యాప్తంగా 54లక్షల 61వేల మంది పింఛనుదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించింది.

చిత్రం..మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు