రాష్ట్రీయం

వైభవంగా మహారుద్ర సహిత సహస్ర చండీయాగం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట/ జగదేవ్‌పూర్, జనవరి 21: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షం కోసం రాష్ట్ర ముఖ్య మంత్రి కే. చంద్రశేఖర్‌రావు సంకల్పించిన చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం సోమవారం గోపూజతో ప్రారంభమైంది. విశాఖ పీఠాధిపతి స్వామి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో జగద్గురు శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి కేసీర్ దంపతులు మహారుద్ర సహిత చండీయాగ క్రతువును నిర్వహించారు. 11.30 గంటలకు ప్రారంభమైన ఈ యాగంలో గణపతి పూజ, శుద్ధిపుణ్యహవచనం, రుత్విక్ తీర్థం, దీక్షాధారణ, చతుర్వేద పారాయణం, యాగ శాల ప్రదక్షిణ, గోపూజ, గురుపూజ, నవగ్రహ పూజ నిర్వహించి రాజశ్యామల యాగం ప్రారంభించారు. అఖండ దీపారాధన, చండీపారాయణం, అభిషేకాలు నిర్వహించారు. ఈ యాగంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 200 మంది రుత్విక్కులతో సాంప్రదాయ బద్ధంగా జరుగుతుంది. రుత్విక్కులంతా పసుపురంగు వస్త్రాలను ధరించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోని ఎర్రవల్లిలో గల సీఎం వ్యవసాయ క్షేత్రంలో
ఐదు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన చండీయాగం విశాఖ శారద పీఠాధిపతి స్వరూపనంద స్వామి ఆశీస్సులతో సీఎం కేసీఆర్ దంపతులు ఈ యాగం జరుపుతున్నారు. ఈ క్రమంలో శృంగేరి పీఠం సాంప్రదాయ పద్దతిలో ఈ యాగం నిర్వహిస్తున్నారు. శృంగేరి పీఠం పండితులు ఫణిశశాంకశర్మ, గోపికృష్ణశర్మ, అష్టకాల రాంమోహన్‌శర్మల పర్యవేక్షణలో ఈ యాగం కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు సాగాలని, రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలు క్షేమంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురువాలని, వ్యవసాయం సుభిక్షంగా ఉండాలని రుత్వీకులు పూజలు చేశారు. రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని, దేశ పౌరులుకు సుపరిపాలన అందాలని భగవంతున్ని ప్రార్థించారు. కాగా పరిమిత సంఖ్యలోనే సందర్శకులకు అనుమతి ఉండడంతో ఈ యాగంలో మొదటి రోజు రాష్ట్ర హోంమంత్రి మమూద్‌హలీ, శాసన సభస్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రులు తన్నీరు హరీష్‌రావు, కల్వకుంట్ల తారకరామారావు, నిజామాబాద్ ఎంపీ కవిత, మెదక్ ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కేశవరావు, సంతోష్‌కుమార్, వంటేరు ప్రతాప్‌రెడ్డిలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
మీడియాకు సైతం అనుమతి లేదు
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ తన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించే చతుర్వేద పురస్సర మహా రుద్ర సహిత చండీయాగానికి మీడీయాకు సైతం అనుమతి నిరాకరించారు. మహారుద్ర సహిత చండీయాగానికి వెళ్లే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారిని అనుమతి లేదని యాగశాలకు అనుమతించలేదు. దీంతో మీడియా ప్రతి నిధులు అంత ఫామ్‌హౌస్ వద్దనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ప్రజాసంబంధ శాఖకు చెందిన ప్రతినిధుల బృందానికి మాత్రమే అనుమతి కల్పించారు.
పోలీసుభారీ బందోబస్తు
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే అన్ని మార్గలలో పోలీసు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సిద్దిపేట పోలిస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపట్టారు.

చిత్రం.. చండీయాగం ప్రారంభానికి ముందు శారదా పీఠాధిపతితో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు దంపతులు