రాష్ట్రీయం

తొలి విడతలో 85 శాతం పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలివిడత పోలింగ్ సోమవారం విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్ మినహాయిస్తే మిగతా 30 జిల్లాల్లో సరాసరిన 85 శాతం ఓట్లు పోలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 95.32 శాతం ఓట్లు పోలయ్యాయి. అతితక్కువగా ఓట్లు పోలయిన జిల్లాగా వికారాబాద్ పేరుతెచ్చుకుంది. ఈ జిల్లాలో 68.25 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. హైదరాబాద్ చుట్టూ రియల్‌ఎస్టేట్ వ్యాపారం బాగా ఉన్న ప్రాంతాల్లోని గ్రామపంచాయతీల్లో పోలింగ్ శాతం భారీగా
ఉంది. దాదాపు 150 పైగా గ్రామాల్లో 85 శాతం నుండి 90 శాతం ఓట్లు పోలయినట్టు సమాచారం అందింది.
సోమవారం ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. పోలింగ్ పూర్తయిన తర్వాత చాలా గ్రామాల్లో మధ్యాహ్నం మూడు గంటల నుండే కౌంటింగ్ ప్రారంభించారు. చాలా వరకు సాయంత్రం ఏడుగంటల వరకే కౌంటింగ్ ముగిసింది.
తొలివిడతలో మొత్తం 4,479 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు నోటీస్ ఇవ్వగా, 769 పంచాయతీల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొమ్మిది పంచాయతీ సర్పంచ్ స్థానాలకు న్యాయపరమైన తదితర కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు. మిగతా 3,701 గ్రామపంచాయతీలకు సోమవారం పోలింగ్ జరిగింది. ఈ స్థానాలకు 12,202 మంది పోటీ పడ్డారు. అలాగే తొలివిడతలో 39,822 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలకు నోటీస్ ఇవ్వగా, 10,654 వార్డులకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. మరో 194 వార్డులకు న్యాయపరమైన తదితర కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు. మిగతా 28,974 వార్డు స్థానాలకు జరిగిన ఎన్నికలకు 70,094 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.