రాష్ట్రీయం

వాల్తేర్ డివిజన్ నుంచి కొత్త రైళ్ళు, ఫ్రీక్వెన్సీ పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 21: కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ నుంచి ప్రతిపాదనలు వెళ్ళాయి. బడ్జెట్ సమావేశాలు సమీపిస్తున్నందున భారతీయ రైల్వేలో ఉన్న 16 రైల్వేజోన్ల నుంచి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు కోరింది. దీంతో ప్రతి రైల్వేజోన్ నుంచి దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, ప్రయాణికుల వసతులతోపాటు కొత్త రైళ్ళు, అదనపు కోచ్‌లు తదితర వాటిపై ఆయా జోన్ల నుంచి ప్రతిపాదనలు ఇప్పటికే పంపినట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్‌కు సంబంధించిన పలు అంశాలతో కూడిన ప్రతిపాదనలను ఇటీవలే పంపినట్టు తెలిసింది. ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్ పరిధిలోకి వచ్చే సంబల్‌పూర్, ఖుర్దాతోపాటు, వాల్తేర్ డివిజన్ ప్రతిపాదనలున్నాయి. ముఖ్యంగా వాల్తేరు డివిజన్‌కు సంబంధించిన ప్రతిపాదనలు కొత్త రైళ్ళు, ఇప్పటికే నడుస్తున్న మరికొన్ని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ల ఫ్రీక్వెన్సీని పెంచడం తదితర అంశాలున్నాయి. గత కొనే్నళ్ళుగా పంపుతున్నవే ఈసారి కూడా ప్రతిపాదనల్లో పేర్కొనడంతో ప్రత్యేకత అంటూ ఏమీ లేకుండా పోయింది. ఎప్పటి నుంచో పరిష్కారానికి నోచుకోనివే ఇందులో ఉన్నట్టు సంబంధిత అధికార వర్గాలు చెబుతున్నాయి. విశాఖపట్నం-వారణాసి మధ్య ప్రత్యేక రైలు నిర్వహించాలని గత అయిదారేళ్ళుగా వాల్తేర్ డివిజన్ నుంచి ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్‌ను కోరడం, దీనిపై ప్రతి ఏడాది జరిగే రైల్వేబడ్జెట్ ప్రతిపాదనల్లో చేర్చడం జరుగుతూనే ఉంది. అయినా డిమాండ్ కలిగి ఉండే ఈ ప్రత్యేక రైలు పట్టాలెక్కనేలేదు. విశాఖ నుంచి బయలుదేరే ఇది రాయ్‌పూర్, బిలాస్‌పూర్, అలాహబాద్ మీదుగా దీనిని నిర్వహించాల్సి ఉంటుందని కూడా ఈ ప్రతిపాదనల్లో వాల్తేర్ డివిజన్ అధికారులు ఎప్పటి మాదిరి పేర్కొన్నారు. అదీ తొలుత వారానికి రెండు రోజులు నిర్వహిస్తే చాలని, ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన తదుపరి డిమాండ్ బట్టి వారంలో కనీసం నాలుగు రోజులు నిర్వహిస్తే బాగుంటుందని కూడా తెలిపారు. అయితే వారణాసి కొత్త రైలు బడ్జెట్‌లోనే చర్చకు రావడంలేదు. ప్రధానమైన వారణాసి ప్రత్యేక రైలుతోపాటు విశాఖపట్నం-బెంగళూరు కొత్త రైలును ప్రవేశపెట్టాల్సి ఉంది. దీనిని విజయవాడ, రేణిగుంట, తిరుపతి, కాట్పాడీ మీదుగా నిర్వహించాలని నిర్ణయించింది. దీనిని ప్రతిరోజు నడిచే విధంగా మంజూరు చేయాల్సిందిగా కోరుతూ ఈ డివిజన్ నుంచి ప్రతిపాదనలు వెళ్ళాయి. వీటితోపాటు విశాఖపట్నం-విజయవాడల మధ్య ఓటర్‌నైట్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-తిరుపతి (ప్రతిరోజు), విశాఖపట్నం-చెన్నైల మధ్య సూపర్‌ఫాస్ట్ (ఓవర్‌నైట్) ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-అజ్మీర్-విశాఖపట్నం మధ్య సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతూ ప్రతిపాదనలు పంపారు.
మరికొన్ని ఎక్స్‌ప్రెస్‌ల ఫ్రీక్వెన్సీని పెంచాలి
ముఖ్యమైన నిత్యం రద్దీతో నడిచే పలు రైళ్ళ ఫ్రీక్వెన్సీని పెంచాల్సిందిగా కూడా ఈ ప్రతిపాదనల్లో డివిజన్ అధికారులు పేర్కొన్నారు. అలాగే విశాఖపట్నం-సికింద్రాబాద్ (22203/22204) మధ్య వారానికి మూడు రోజులు దురంతో రైలును రోజూ నిర్వహించాలని, విశాఖపట్నం-నిజాముద్దీన్ (12807/ 12808)ల మధ్య వారానికి ఐదు రోజులు నడిచే సమతా ఎక్స్‌ప్రెస్‌ను రోజూ నడిపేలా విధంగా ఈ బడ్జెట్‌లో మంజూరు చేయాలని కోరారు. విశాఖపట్నం-లోక్‌మాన్య తిలక్ టెర్మినల్ (ఎల్‌టీటీ-22847/22204) మధ్య వారానికి ఒకరోజు రాయగడ, నాగపూర్‌ల మీదుగా నడుస్తోందని, అందువల్లదీనిని కనీసం మూడు రోజులకు పొడిగించాలని, విశాఖపట్నం-షిరిడి (18503/18504), విశాఖపట్నం-కొల్లాం (18567/18568)ల మధ్య వీక్లీ, విశాఖపట్నం-గాంధీగామ్ (18501/18502)ల ఫ్రీకెన్వీనీ పెంచాల్సిందిగా పేర్కొన్నారు.