రాష్ట్రీయం

ప్రజాపద్దుల కమిటీ చైర్‌పర్సన్‌గా గీతారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: తెలంగాణ ప్రజాపద్దుల కమిటీ (పిఏసి) చైర్‌పర్సన్‌గా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యురాలు జె గీతారెడ్డిని నియమించినట్టు శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రకటించారు. ఇదే పదవికి అదే పార్టీ నుంచి పోటీపడిన మరో సభ్యుడు టి జీవన్‌రెడ్డిని కమిటీ సభ్యునిగా నియమించినట్టు స్పీకర్ పేర్కొన్నారు. శాసనసభ నియమావాళి ప్రకారం ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌గా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యుడిని నియమిస్తారు. అయితే ఇప్పటివరకు పిఏసి చైర్మన్‌గా కొనసాగిన ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో చైర్మన్ పదవి కోసం ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి స్పీకర్ కార్యాలయం ప్రతిపాదనను కోరగా గీతారెడ్డి, జీవన్‌రెడ్డి ఇద్దరి పేర్లతో సిఎల్‌పి లేఖ రాసింది. దీంతో ఇద్దరిలో ఒకరిని చైర్మన్‌గా, మరొకరిని కమిటీ సభ్యుడిగా నియమించినట్టు శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయడానికి ముందు ప్రకటించారు. పిఏసి చైర్మన్‌గా నియమితులైన గీతారెడ్డి ప్రస్తుతం మెదక్ జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.