రాష్ట్రీయం

టీడీపీ నుంచి మేడా సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 22: కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కొంత కాలంగా మేడా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారని, అలాంటి వారిని పార్టీలో ఎలా కొనసాగిస్తారంటూ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మంగళవారం ఉండవల్లి ప్రజావేదిక వద్దకు చేరుకుని చంద్రబాబుకు పరిస్థితిని వివరించారు. మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి, మేడా వర్గీయుల మధ్య కొంతకాలంగా ప్రచ్ఛన్నయుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజంపేటతో పాటు జమ్మలమడుగు నియోజకవర్గాల్లో నెలకొన్న విభేదాలను సమన్వయం చేయాలని చంద్రబాబు భావించి, ఇరువురు నేతలను ఉండవల్లి రావాలని ఆదేశించారు. అయితే మేడాతో పాటు ఆయన అనుచరులెవరూ ఉండవల్లికి చేరుకోలేదు. ఈలోపు మేడా వ్యతిరేక వర్గం కార్యకర్తలు పెద్దసంఖ్యలో చేరుకుని ఎమ్మెల్యే మేడా అనర్హుడని వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. కార్యకర్తల ఒత్తిడి మేరకు మేడాను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవాళ్లకు టీడీపీలో స్థానం లేదన్నారు. మల్లికార్జున రెడ్డిని ఎమ్మెల్యేగా చేశాం.. శాసనసభ విప్‌గా
గౌరవించాం.. ఆయన తండ్రిని టీటీడీ సభ్యునిగా నియమించాం.. ఐదేళ్లూ పదవులు అన్నీ అనుభవించారు.. ఎన్నికలు రాగానే ఉడాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తులు అప్రస్తుతం.. పార్టీయే శాశ్వతమని, పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. రాజంపేటతో సహా కడప జిల్లాలో టీడీపీ ఘనవిజయం తథ్యమన్నారు. నాలుగున్నరేళ్లలో కడపలో గణనీయమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశామని అవే పార్టీని గెలిపిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. పింఛన్లపై ఏడాదికి రూ 14వేల కోట్లు ఇస్తున్నాం.. రైతులకు రూ 24వేల కోట్ల రుణమాఫీ చేశాం.. కడపలో చీనీచెట్లు ఎండిపోకుండా కాపాడామని గుర్తుచేశారు. గండికోట, చిత్రావతి, పైడిపాలేనికి నీరిచ్చామని చెప్పారు. ఆటోలు, ట్రాక్టర్లపై పన్నులు తొలగించి పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. రాజంపేటకు సమర్థుడైన ఇన్‌చార్జ్‌ను నియమిస్తామని, కలసి కట్టుగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

చిత్రం..కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతున్న
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు