రాష్ట్రీయం

ఫిట్‌మెంట్‌పై వీడని పీటముడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), జనవరి 22: రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా ఆర్టీసీకి వస్తున్న నష్టాలను సాకుగా చూపించి కార్మికులకు ఫిట్‌మెంట్ పెంచడంపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిట్‌మెంట్ అంశంపై యాజమాన్యంతో రెండోసారి జరిపిన చర్చలు విఫలమయ్యాని, బుధవారం సమ్మె సన్నాహక షెడ్యూల్‌ను విడుదల చేస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు. విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో మంగళవారం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలతో సంస్థ యాజమాన్యం మరోసారి చర్చలు జరిపింది. జీతభత్యాల సవరణలో 50 శాతం ఫిట్‌మెంట్ ఉద్యోగ సంఘాలు అడుగుతుంటే 20 శాతానికి మించి
ఇచ్చేది లేదని యాజమాన్యం ఈ చర్చల్లో స్పష్టం చేసింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల ఫిట్‌మెంట్‌పై పీటముడి వీడలేదు. చర్చల అనంతరం ఇయు పే కమిటీ నేతలు విలేఖరులతో మాట్లాడుతూ సంస్థలో వస్తున్న నష్టాలకు ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలే కారణమన్నారు. ఆర్టీసీలో ఉన్న మొత్తం నష్టాలు, అప్పులు అన్నీ ప్రభుత్వమే భరించాలన్నారు. ఇప్పటి నష్టాలకు ఆర్టీసీ ఉద్యోగులు కారణం కాదని, నష్టాలను సాకుగా చూపి ఇప్పటి ప్రభుత్వ ఉద్యోగుల కంటే కేటగిరిల వారీగా 20 నుండి 30 శాతం జీతభత్యాలలో వ్యత్యాసంతో పనిచేయిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం వేతనాల సవరణ గడువు దాటిపోయి 21 నెలలు కావస్తున్నా, ఇంకా నష్టాల పేరుతో జీతభత్యాల సవరణలో సాకులు చెబుతున్నారన్నారు. సిబ్బందికి 50 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల్సిందేనన్నారు. యాజమాన్యం మొండికేసి 20 శాతం మాత్రమే ఇస్తామని చెబుతోందని, ఈ కారణంతోనే చర్చలు విఫలం అయినట్టుగానే భావిస్తున్నామన్నారు. వేతన సవరణలో డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే ఆర్టీసీలో ఉన్న 8 సంఘాలతో కలిసి జేఏసీగా ఏర్పాడ్డామన్నారు. ఇంకా కలిసి రాని ఎన్‌ఎంయూను కూడా కలుపుకుని ముందుకు వెళతామన్నారు. బుధవారం జేఏసీ సమావేశం నిర్వహించి సమ్మె తేదీ ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో చేపట్టబోయే సమ్మె సన్నాహక షెడ్యూల్‌ను కూడా ప్రకటిస్తామన్నారు. యాజమాన్యం ఒకవైపు చర్చలు జరుపుతుండగానే సిబ్బందిని కుదించేందుకు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆర్టీసీ కార్లకు ప్రైవేటు డ్రైవర్లను పంపేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. సెక్యూరిటీ, సివిల్ ఇంజనీరింగ్ విభాగాలలో సిబ్బందిని తగ్గించడం, యూనియన్‌కు ఇచ్చే రాయితీలను రద్దు చేయడం, గుర్తింపు సంఘానికి సంబంధం లేకుండా ఆదేశాలు జారీ చేయడం వంటివి యాజమాన్యం చేస్తోందన్నారు. ఈ ధోరణి కార్మిక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఉందన్నారు. మంగళవారం జరిగిన చర్చల్లో ఆర్టీసీ ఎండి సురేంద్రబాబు, ఈడీలు ఎ కోటేశ్వరరావు, జయరావు, రామకృష్ణ, వెంకటేశ్వరరావు, ఫైనాన్స్ అడ్వైజర్ రాఘవరెడ్డి, చీఫ్ పర్సనల్ మేనేజర్ ఆదాం సాహెబ్, పర్సనల్ ఆఫీసర్లు, రెడ్డి, శ్రీ్ధర్, చిరంజీవి, జేఏసీ నేతలు ఇయు పే కమిటీ సభ్యులు వైవి రావు, పి దామోదరరావు, హనుమంత రావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
చిత్రం..ఆర్టీసీ యాజమాన్యంలో జరిపిన చర్చల వివరాలు వెల్లడిస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు