రాష్ట్రీయం

సీమ రైతాంగం సమస్యలు తీర్చడానికే హంద్రీ-నీవా జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దతిప్పసముద్రం/ ములకలచెరువు: రాయలసీమ రైతుల సమస్యలు తీర్చడానికే హంద్రీ-నీవా జలాలు తీసుకువచ్చామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాధ్‌రెడ్డి అన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన పిటిఎం మండలంలోకి హంద్రీ-నీవా జలాలు ప్రవేశించగా జలహారతి కార్యక్రమానికి వీరు ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. మొదటగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత 30 ఏళ్ల కాలంగా రాయలసీమ రైతాంగం ఎదురుచూస్తున్న హంద్రీ-నీవా జలాలు కర్నూలు, అనంతపురం జిల్లాలు దాటుకొని నేడు చిత్తూరు జిల్లాకు చేరుకున్నాయన్నారు. గత 30 ఏళ్ళ క్రితం దివంగత సీఎం ఎన్టీరామారావు మొదటిసారిగా కర్నూల్‌లో ఉన్న హంద్రీ, చిత్తూరులో ఉన్న నీవాను కలిపి హంద్రీ-నీవాగా నామకరణం చేశారని, ఆయన అంతరంగికుడు శ్రీరామకృష్ణయ్య ద్వారా సర్వే చేయించి అప్పుడు కాలువ నిర్వహణ పనుల కోసం ఎర్పాట్లు చేశారని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కలను నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పూర్తిచేశారని వారు పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ గంగా, కావేరిలను అనుసంధానం చేస్తానంటూ ఐదేళ్ళ క్రితం చెప్పారని, ఇంతవరకు అనుసంధానం చేయలేదన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని నదుల అనుసంధానం పనిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేశారన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణ - గోదావరి నదులను అనుసంధానం చేస్తుంటే ప్రతిపక్షాలు నిందలు వేశాయన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ వైకాపా ఎమ్మెల్యే ఐదేళ్ళలో పూర్తిచేసినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని శాసనసభలో చెప్పారని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.750కోట్లు ఖర్చు చేసి ఐదున్నర నెలల్లో పట్టిసీమను పూర్తిచేయించి అక్కడ నుండి శ్రీశైలం ద్వారా మిగులు జలాలను హంద్రీ-నీవాకు తెచ్చారన్నారు. సుమారు 560 కిలోమీటర్ల దూరంలో ఉన్న హంద్రీ-నీవా పనులను గత ప్రభుత్వం కాలువలు తవ్వి వదిలేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు పనులన్ని పూర్తిచేసి నీరు పారుతుంటే ప్రతిపక్షాలు అవినీతి జరిగిందంటూ విమర్శించడం సబబు కాదన్నారు. దేశంలోనే అనంతపురం జిల్లాను శాశ్విత కరవు జిల్లాగా ప్రకటించారని, ప్రస్తుతం హంద్రీ-నీవా జలాలతో దేశంలో ఉద్యానవన పంటలు పండించడంలో మొదటి స్థానంలో ఉందని తెలిపారు. కర్నూలు వద్ద ఉన్న మాల్యాల ప్రాజెక్టులో నీటి శాతం తగ్గడంతో మచ్చిమార్రి జలాశయం నుండి నీటిని అందిస్తున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లాలోని 9 నియోజకవర్గాలకు హంద్రీ-నీవా నీళ్లు అందుతాయని, మరో ఆరు నియోజకవర్గాలకు గాలేరు-నగిరి ద్వారా నీటిని అందిస్తామని తెలిపారు. రైతులు ఇకపై వరి పంట సాగుకు వెళ్లకుండా పండ్ల తోటల పెంపకంపైనే దృష్టి సారించాలన్నారు. కృష్ణమ్మ తల్లి మనకు రాకుండా కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు అడ్డుకుంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు తన 40 సంవత్సరాల అనుభవంతో కృష్ణమ్మ తల్లిని గోదావరిలో కలిపి ఇక్కడకు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి.శంకర్‌యాదవ్, ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, దొరబాబు, జడ్‌పి చైర్మన్ గీర్వాణి చంద్రప్రకాశ్, జిల్లా టీడీపీ అధ్యక్షులు నాని, డీసీసీ ప్రెసిడెంట్ అమాష రాజశేఖర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జాయింట్ కలెక్టర్ గిరీషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..-రైతులనుద్దేశించి మాట్లాడుతున్న నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు