రాష్ట్రీయం

వాళ్లు మొహం చాటేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా మొహం చాటేశారని ముఖ్యమంత్రి కెసిఆర్ విమర్శించారు. గురువారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం సాయంత్రం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత బిజెపి శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణమే కాదు అన్ని విషయాల్లోనూ ప్రతిపక్షాలను కలుపుకుని వెళ్ళాలని సూచించారు. అందుకు ముఖ్యమంత్రి ప్రతిస్పందిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అందరినీ ఆహ్వానించినట్లు చెప్పారు. టిడిపి-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా మొహం చాటేసి, బయట ఉండి విలేఖరుల సమావేశాల్లో బ్లాక్-డే, రెడ్-డే అంటూ విమర్శలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. శాసనసభకు మించిన దేవాలయం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. సభకు హాజరైతే వారు చేసిన దగా, ఘాతుకాలు, మోసం బయటపడతాయని రాలేదని ఆయన విమర్శించారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద శాతం రాజకీయ అవినీతి మటుమాయమైందని ప్రతిపక్షాలకు చెందిన నాయకులే అన్నారని ఆయన తెలిపారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను అభినందిస్తూ కొన్ని వందల ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయని, సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వర రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా ఎస్‌ఎంఎస్ పంపించారని ఆయన తెలిపారు. కాంగ్రెస్-టిడిపిలకు పంచాయతీ కావాలా లేక నీళ్ళు కావాలా?, రాజకీయాలు కావాలా లేక నీళ్ళు కావాలా? అని ప్రశ్నించారు.వైకాపా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ ఎత్తిపోతల వల్ల విద్యుత్తు ఖర్చు 8 వేల కోట్ల రూపాయల వచ్చినా ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ కృష్ణా నదిలో ఐదారు సంవత్సరాలు తప్ప మిగతా సంవత్సరాల్లో 900 నుంచి 2 వేల క్యూసెక్కుల వరకు నీరు ఉందని అన్నారు. గోదావరి-కృష్ణ నీటిపై ఎపి సిఎంతో మాట్లాడుతానని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనతో భద్రాచలం నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఆంధ్రలో కలిసాయని, ఈ విషయాన్ని ఎపి ముఖ్యమంత్రి మాట్లాడితే సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. ఐదారు గ్రామ పంచాయతీలు వెనక్కి వస్తాయని ఆయన తెలిపారు.
ప్రజల్లో విశ్వాసం పెరిగింది: కెటిఆర్
శాసన సభలో ముఖ్యమంత్రి ఆవిష్కరించిన తెలంగాణ జల విధాన ప్రకటన తెలంగాణ రైతాంగం పట్ల నిబద్ధతకు అద్దం పట్టిందని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. తెలంగాణతో రైతులకు కలిగే ప్రయోజనాలను దశాబ్ద కాలంగా ఉద్యమ నాయకుడిగా చెప్పిన కెసిఆర్, ముఖ్యమంత్రిగా వాటిని నెరవేర్చే లక్ష్యంగా సాగుతున్నారని అన్నారు. తెలంగాణ జల అవసరాలపై ముఖ్యమంత్రికి ఉన్న అద్భుతమైన విషయ పరిజ్ఞానం ప్రజలకు అర్ధమయ్యే భాషలో సాగిందని అన్నారు.