రాష్ట్రీయం

నాగోబా జాతరకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జనవరి 22: కెస్లాపూర్‌లో జరిగే నాగోబా జాతర ఉత్సవాలు ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించాలని, ప్రభుత్వం జాతర ఉత్సవాలను రాష్ట్ర పండగలా నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ దివ్య అన్నారు. మంగళవారం ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, జిల్లా అధికారులతో కలిసి ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లోని నాగోబా జాతర ఉత్సవాల ఏర్పాట్లను సమీక్షించారు. అక్కడ జరుగుతున్న పనులను ఈ సందర్భంగా పరిశీలించారు. అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ దివ్య మాట్లాడుతూ అనాదిగా ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింభించే రీతిలో నిర్వహిస్తున్న నాగోబా జాతర ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని ఫిబ్రవరి 4న కెస్లాపూర్‌లో జాతర ఉత్సవాలు మెస్రం వంశస్తుల ఆచారాల మేరకు ప్రారంభమవుతాయని అన్నారు.
ఈనెల 27లోగా పనులకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా భక్తులకు తాగునీటి వసతి కల్పించేలా ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ఇప్పటి నుండే పనులు వేగిరపర్చాలన్నారు. రక్షిత మంచినీటిని అందుబాటులో ఉంచాలని, మూత్ర శాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, ఆలయ ప్రాంగణాన్ని మైదానంలా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సందర్భంగా మెస్రం వంశస్తులు కోటి 50లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఆలయ మండప నిర్మాణ పనులను పరిశీలించారు.