రాష్ట్రీయం

జగన్‌పై దాడి కేసు వెనుక కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 23: ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి కేసు వెనుక సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, కొందరు పోలీస్ అధికారుల కుట్ర ఉందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌పై దాడి కేసును కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఐఏకు అప్పగించడంతో బుధవారం ఎన్‌ఐఏ కోర్టులో వేసిన అఫిడవిట్‌లో స్పష్టంగా కుట్ర కోణం ఉందని తేల్చడమే నిదర్శనమన్నారు. ఈ కేసును పూర్తిగా నీరుగార్చడానికి ప్రభుత్వం చూస్తోందని, కుట్ర కోణం లేకపోతే ఎందుకు ఎన్‌ఐఏకు టీడీపీ నాయకులు, అధికారులు సహకరించడం లేదన్నారు. ఈ కేసు విషయంలో కేవలం టీడీపీ నాయకులు కావాలనే రోజుకో మలుపు తిప్పుతున్నారని, ఎన్‌ఐఏ విచారణ సంస్థకు విశాఖ పోలీసులు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ విభజన హమీల అమలు, ప్రత్యేక హోదా విషయంలో తాము అధికారంలోకి వస్తే ఇస్తామనే విషయాన్ని కాగితాలపై చూపిస్తేనే నమ్ముతామన్నారు. అగ్రవర్ణ పేదలకు కేంద్రం ప్రకటించిన పదిశాతం రిజర్వేషన్లు కేంద్రం చూపిన మార్గదర్శకాల ప్రకారమే ఇవ్వాలని, కేవలం కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈవీఎంల వాడకంపై చర్చ మంచిదేనని, కానీ టీడీపీ నాయకులు మాత్రం ఏది చెప్పినా ప్రజలంతా వినేస్తారనే భ్రమలో ఉన్నారన్నారు.

చిత్రం..విశాఖలో మీడియాతో మాట్లాడుతున్న వైసీపీ నేత బొత్స