రాష్ట్రీయం

జనంలోకి వెళ్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లోకి వెళ్లి ఎండగడతామని, ప్రజా ఉద్యమాలను, ఆందోళనలను ఉధృతం చేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. వ్యక్తిత్వం, విశ్వసనీయత లేని నాయకుడు చంద్రబాబు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని ఆయన ధ్వజమెత్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తాము అమరావతి రాజధాని భూముల దందా మొదలుకుని, పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల వరకు అన్ని అంశాలను బహిర్గతం చేశామన్నారు. గురువారం ఆయన ఇక్కడ లోటస్‌పాండ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం, స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంతోపాటు ద్రవ్య వినిమయ బిల్లుపై డివిజన్ ఓటింగ్‌ను కోరామని చెప్పారు. డివిజన్ ఓటింగ్ కోరితే ప్రభుత్వం పారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేదన్నారు. వైకాపా ఎమ్మెల్యేలపై అనర్హతవేటు పడితే ఎన్నికలను ఎదుర్కొనాల్సి వస్తుందని, ఉప ఎన్నికల్లో ఓటమి చెందితే, రాజకీయంగా పతనం ఇప్పుడే ప్రారంభమవుతుందనే భయంతో చంద్రబాబు డివిజన్ ఓటింగ్ అడిగితే ఆమోదించకుండా మూజువాణి ఓటుతో సభను ముగించారన్నారు.
ఎస్సీ ఉపప్రణాళిక కింద రూ. 4778 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, రూ. 1504 కోట్లను ఖర్చుపెట్టారని, ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ. 1886 కోట్లకు ర. 1126 కోట్లను ఖర్చు పెట్టారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రుణాలు రూ. 97,123 కోట్లు ఉంటే, ఇప్పుడు 1.90 వేల కోట్లకు చేరుకున్నాయన్నారు. రాష్ట్రప్రభుత్వం మార్చి నెలలో 20 రోజుల్లో 32 వేల కోట్లు ఖర్చుపెట్టిందని, దీని వల్ల నిజంగా అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు పెద్ద స్కాం అన్నారు. స్పీకర్ కూడా పక్షపాత వైఖరితో సభను నిర్వహించారన్నారు.
అనేక సందర్భాలు తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. వైకాపా ఎమ్మెల్యే రోజాకు అనుకూలంగా సింగిల్ జడ్జి కోర్టు తీర్పు ఇస్తే పట్టించుకోకుండా, అసెంబ్లీలోకి రానివ్వకపోవడం దారుణమన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు స్పీకర్ సహకరించారన్నారు.
ఇసుక మాఫియాలో అధికార పార్టీకి చెందిన వారు రెండు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. విద్యుత్ చార్జీలను పెంచడాన్ని ఆయన ఖండించారు. పారిశ్రామిక వర్గాలకు ఆందోళన కలిగించే విధంగా ఈ చార్జీలు పెంచారన్నారు. బయటకు గృహ విద్యుత్ వినియోగదారులకు పెంచనట్లు కనపడుతున్నా, గ్రూపులుగా విభజించి తెలియకుండా విద్యుత్ చార్జీల భారం మోపుతున్నారని ఆయన అన్నారు.